Begin typing your search above and press return to search.
ఇక లాభం లేదనుకుని పెళ్లి చేసుకుందా?
By: Tupaki Desk | 16 Jun 2019 11:05 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా నిలదొక్కుకోవడం కష్టం అనే విషయం మరోసారి అనీషా ఆంబ్రోస్ ద్వారా వెళ్లడయ్యింది. దాదాపు పది సినిమాల్లో తెలుగమ్మాయి అనీషా ఆంబ్రోస్ నటించింది. కాని ఏ ఒక్కటి కూడా ఆమెకు సక్సెస్ తెచ్చి పెట్టలేక పోయాయి. నటిగా గుర్తింపు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన అనీషా ఆంబ్రోస్ తాజాగా కూడా '7' అనే చిత్రంలో నటించింది. ఎప్పటి నుండో సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న అనీషాకు ఇంకా చిన్నా చితకా ఆఫర్లు తప్ప స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కడం లేదు. దాంతో చేసేది లేక పెళ్లికి సిద్దం అయ్యింది.
ముద్దుగుమ్మ అనీషా ఆంబ్రోస్ తాజాగా పెళ్లి చేసుకున్నట్లుగా ప్రకటించింది. అనీషా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనీషా హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం అందరిని ఆశ్చర్యపర్చుతోంది. అలియాస్ జానకి అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ అనీషా ఆంబ్రోస్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా ఏ ఒక్క సినిమా ఈమెకు స్టార్ డం ను తెచ్చి పెట్టలేక పోయాయి.
ఆమద్య 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో ఈ అమ్మడిని పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని అనీషా ఆంబ్రోస్ కూడా కన్ఫర్మ్ చేసింది. కాని ఆ సినిమా ఆలస్యం అవ్వడం.. దర్శకుడు మారడం వంటి కారణాల వల్ల వచ్చిన అవకాశం చేజారి పోయింది. పవన్ తో మూవీ చేసి ఉంటే ఈ అమ్మడి ఫేటు మారి పోయి ఉండేదేమో. అనీషా సడెన్ మ్యారేజ్ ప్రకటన నేపథ్యంలో ఈమెది లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విషయమై అనీషా నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. అనీషా ఆంబ్రోస్ ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వాడు అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. తన భర్త గురించిన విషయాలను అనీషా ఆ తర్వాత వెళ్లడిస్తుందేమో చూడాలి.