Begin typing your search above and press return to search.

గోదారి అందాల మధ్య వంశీ హీరోయిన్

By:  Tupaki Desk   |   6 Jan 2017 5:59 AM GMT
గోదారి అందాల మధ్య వంశీ హీరోయిన్
X
మూడేళ్లుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా స్థిరపడేందుకు వైజాగ్ బ్యూటీ అనీషా ఆంబ్రోస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. చిన్న సినిమాల్లో తప్ప ఇప్పటివరకూ క్రేజీ ప్రాజెక్టుల్లో భాగం కాలేకపోయింది. రీసెంట్ గా మోహన్ లాల్ మూవీ మనమంతాలో మంచి కేరక్టర్ తో ఆకట్టుకున్నఈ సుందరి.. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రంలో నటిస్తోంది.

వంశీ సినిమాలంటే ప్రతీ ఫ్రేమ్ ఎంత అందంగా అద్భుతంగా ఉంటుందో తెలిసిందే. తన అభిరుచికి తగ్గట్లుగానే ఈ సినిమాని కూడా కొంతభాగం.. కొన్ని పాటలు గోదావరి జిల్లాల్లో చిత్రీకరిస్తున్నాడు వంశీ. గోదావరి జిల్లాల అందాలను చూసిన అనీషాకి మైండ్ బ్లాంక్ అయిపోయిందట. 'ఓ నది.. కొండలు.. పడవలు.. వాటిలో ప్రయాణం.. ఇలాంటి ఆలోచన వస్తే.. నా మనసులో కేరళ ఒక్కటే మెదిలేది. కానీ గోదావరి ప్రాంతం కేరళకు ఏ మాత్రం తీసిపోదని.. మరింత అందంగా ఉంటుందనే విషయం ఇప్పుడే అర్ధమైంది' అని చెబుతోంది అనీషా ఆంబ్రోస్. గోదారి జిల్లా రుచులను తెగ ఆస్వాదిస్తున్నట్లు చెబుతున్న ఈ హీరోయిన్.. ఫ్యాషన్ డిజైనర్ మూవీలో తను మహాలక్ష్మి పాత్ర చేస్తున్నానని తెలిపింది.

ఎనిమిది రోజుల పాటు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని ప్రాంతంలో షూటింగ్ చేశామని.. 'సెల్ ఫోన్ లేకుండా నేను బతకగలనన్నమాట' అనిపించిందని అంటూ నవ్వేసింది అనీషా. వంశీ టేకింగ్.. ఆయన సెట్స్ లో గట్టిగా మాట్లాడే విధానం చూస్తే.. ముందు కొంత భయంలాంటివి అనిపించినా.. ఆయనతో కొంత జర్నీ చేశాక.. ఆయన ఎంతో మృదువైన మనిషి అని అర్ధమవుతుందని చెబుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/