Begin typing your search above and press return to search.

లవ్వూ లేదు.. పాటల్లేవ్.. అయినా నచ్చింది

By:  Tupaki Desk   |   7 Nov 2017 4:51 AM GMT
లవ్వూ లేదు.. పాటల్లేవ్.. అయినా నచ్చింది
X
ఇండస్ట్రీలో లైమ్ లైట్ లోకి రావాలని కోరుకునే హీరోయిన్లు మూడు ఫైట్లు.. ఆరు పాటలు ఉండే కమర్షియల్ సినిమాలనే కోరుకుంటారు. లవ్ సీన్లు లేకుండా.. పాటలు - డ్యాన్సులు అవీ లేకుండా హీరోయిన్ గా చేయాలంటే ఒకింత ఆలోచించాల్సిందే. కానీ హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ అలాంటి పాత్ర కావాలనే చేశానని చెబుతోంది. ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ లో వంశీ తీర్చిదిద్దిన అందాల బొమ్మగా మెరిసన ఈ భామ లేటెస్ట్ సినిమా ఒక్కడు మిగిలాడులోనూ డిఫరెంట్ రోల్ చేశానంటోంది.

మంచు మనోజ్ హీరోగా నటించిన ఒక్కడు మిగిలాడు సినిమాలో అనీషా హీరోయిన్ గా నటించింది. ఈసినిమాలో మనోజ్ రెండు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ఎల్.టి.టి.ఇ. చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్ర. ఇది 1997 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. మరొకటి ప్రస్తుత టైంలో నడుస్తుంది. ఈ సినిమా కోసం హీరో మంచు మనోజ్ పడ్డ కష్టం మరిచిపోలేనని హీరోయిన్ అనీషా చెబుతోంది. ‘‘రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో మనోజ్ నటన నిజంగా మైండ్ బ్లోయింగ్. అతడు ఈ సినిమా కోసం చాలాచాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మనోజే నాకు పెద్ద ఇన్ స్పిరేషన్. ఈ స్క్రిప్టు చూశాను. పాటలు.. లవ్ ట్రాక్ లేకపోయినా లోటేం లేదు. నిజాన్ని వెలికితీసే జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నా.’’ అంటూ అనీషా చెప్పుకొచ్చింది.

తాజాగా రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒకటే జిందగీలో కామియో రోల్ లో తళుక్కున మెరిసిన అనీషా తర్వాత అల్లరి నరేష్ పక్కన హీరోయిన్ గా కనిపించబోతోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఓ సినిమా పూర్తి చేసింది. తన కెరీర్ సాఫీగానే సాగుతోందని.. ఏ విషయంలోనూ డిజప్పాయింట్ మెంట్ లేదని అంటోంది. అమ్మడికి అందం ఉంది. అవకాశాలు వస్తున్నాయి. కానీ కమర్షియల్ బ్రేక్ మాత్రం ఎందుకో అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.