Begin typing your search above and press return to search.

క్రిస్మస్ స్పెషల్ నానమ్మ చేసే వైన్

By:  Tupaki Desk   |   20 Dec 2016 1:30 PM GMT
క్రిస్మస్ స్పెషల్ నానమ్మ చేసే వైన్
X
క్రిస్మస్ పండుగ చాలామంది హీరో హీరోయిన్లకు సంథింగ్ సంథింగ్ స్పెషల్. ఎవరికి వారు తమ టేస్ట్ ప్రకారం జరుపుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి తాను క్రిస్మస్ ఎలా జరపుకున్నదో.. ఈ ఏడాది ఎలాంటి మార్పులు ఎందుకు వచ్చాయో చెబుతోంది.. అలియాస్ జానకి - గోపాలా గోపాలా - రన్ - మనమంతా వంటి తెలుగు చిత్రాల్లో కనింపించిన అనీషా ఆంబ్రోస్.

'మా ఫ్యామిలీకి క్రిస్మస్ అంటే వైజాగ్ లో నానమ్మతో జరుపుకోడమే. పిల్లలు అందరం కలిసి నవంబర్ చివరి నుంచి క్రిస్మస్ ట్రీ తయారు చేసి అలంకరణ స్టార్ట్ చేసేసే వాళ్లం. టేప్ రికార్డర్ లో రోజంతా కార్లోస్ మ్యూజిక్ ప్లే అవుతూన ఉండేది. ఇక నానమ్మ తయారు చేసే వంటలైతే అదరహో. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్ లేకుండా ఆమె ప్రత్యేకంగా వైన్ తయారు చేసేది.. దాని కోసం అందరం పడి చచ్చేవాళ్లం' అన్న అనీషా.. మూడేళ్ల క్రితం ఆమె కాలం చేసిందని.. అప్పటి నుంచి క్రిస్మస్ పండుగ అలా జరగడం లేదని చెప్పింది.

'షూటింగ్స్ తో బిజీగా ఉన్నా క్రిస్మస్ ను మాత్రం నేను నిర్లక్ష్యం చేను. ఈ సారి ఒరిస్సాలోని ఖుద్రాలో ఉన్న మా పూర్వీకుల ఇంటిలో జరుపుకోబోతున్నాం. అక్కడికి వెళ్లడం నాకు ఇదే తొలిసారి. మా కుటుంబాల్లో అన్ని వైపుల నుంచి అందరూ అక్కడికి చేరుకుంటారు. సో.. ఈ సారి క్రిస్మస్ నాకు చాలా స్పెషల్' అని చెప్పింది రన్ బ్యూటీ అనీషా ఆంబ్రోస్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/