Begin typing your search above and press return to search.
మలైకా మామ్ ఆ డక్ వాక్ ఆపండి ప్లీజ్!
By: Tupaki Desk | 10 May 2023 8:00 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. యువహీరో అర్జున్ కపూర్ తో సహజీవనంలో ఉన్న మలైకా 49 వయసులోను ఇప్పటికీ సిక్స్ టీన్ వైబ్స్ తో యువతరం గుండెల్ని కొల్లగొడుతోంది. ఇక మలైకా సోషల్ మీడియా క్వీన్ గా వెలిగిపోతోంది. మీడియా అండ్ ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్లీ నేచుర్ ఈ అమ్మడిని నిరంతరం హెడ్ లైన్స్ లో నిలుపుతోంది. ఫోటోషూట్ల కోసం నిరంతరం రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ మతులు చెడగొట్టే మల్లా డక్ వాక్ స్పెషలిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఫోటోషూట్ కోసం తనను వెంబడించిన ఫోటోగ్రాఫర్ల ముందు డక్ వాక్ చేస్తూ మలైకా తనదైన యూనిక్ నెస్ ని ఎలివేట్ చేసింది.
ప్రతిసారీ ఫోటోగ్రాఫర్లతో పరాచికాల్లో మలైకా డక్ వాక్ చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఇప్పుడు మలైకా ను అనుకరిస్తూ ప్రముఖ హోస్ట్ కం నటి అనీషా ధీక్షిత్ విమానాశ్రయంలో చేసిన యాక్ట్ యూత్ లో చర్చగా మారింది. మలైకాను ఇమ్మిటేట్ చేస్తూ అనీషా డక్ వాక్ చేసింది. టైట్ ట్రాక్ దుస్తుల్లో విమానాశ్రయంలో ప్రత్యక్షమైన అనీషా తనదైన శైలిలో డక్ వాక్ చేసిన వీడియోని ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోని షూట్ చేస్తున్న వీడియో గ్రాఫర్ మలైకా మామ్ మలైకా మామ్ అంటూ వెంటపడడం పన్ ని ఎలివేట్ చేస్తోంది.

అనీషా ధీక్షిత్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. యూట్యూబ్ లో పాపులర్ ఫేస్. హోస్ట్ గా చక్కని ప్రతిభను కనబరిచిన ఈ బ్యూటీ ఇప్పుడు వెండితెర వెలుగుల కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. అనీషా ప్రతిభకు ఆకర్షితులైన పలువురు దర్శకనిర్మాతలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలు కల్పిస్తున్నారని తెలిసింది.