Begin typing your search above and press return to search.
ఫ్యాషన్ డిజైనర్.. ప్రేయసిలు వీళ్లే!!
By: Tupaki Desk | 3 Nov 2016 7:30 PM GMTలేడీస్ టైలర్.. 31 ఏళ్ల క్రితం తెలుగులో ఎన్నో సంచలనాలు సృష్టించిన సినిమా ఇది. అడల్ట్ కామెడీకి దగ్గరగా అనిపించే ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీకి టాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. లేడీస్ టైలర్ లో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎంత ముఖ్యమో.. అతని ప్రేయసులుగా నటించిన భామలు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడా లేడీస్ టైలర్ కి సీక్వెల్ సిద్ధమవుతోంది.
సీనియర్ దర్శకుడు వంశీనే ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేయనుండగా.. ''ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్'' అనే టైటిల్ పై రూపొందనున్న ఈ మూవీలో.. సుమంత్ అశ్విన్ హీరో. మరి ఫ్యాషన్ డిజైనర్ తో జోడీ కడుతున్న అందాల భామలు కూడా ఫైనల్ అయిపోయారు. మొత్తం ముగ్గురు సుందరాంగులు ఫ్యాషన్ డిజైనర్ లో హీరోయిన్లు. వారిలో అనీషా ఆంబ్రోస్ ఒక హాట్ ఎన్నారై పాత్రను చేస్తోందట. అలాగే తెలుగమ్మాయి మానస హిమవర్ష కూడా మాంచి స్పయిసీ రోల్ చేస్తోందని తెలుస్తోంది. ఇక కొత్తపిల్ల మనాలీ రాథోడ్ (ఓ స్ర్తీ రేపురా ఫేం) కూడా ఒక పాత్రను దక్కించుకుంది. ఈ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ సుమంత అశ్విన్ అదరగొడతాడని అంటున్నారు సన్నిహితులు.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తన సినిమాలోని పాటలను చాలా ఏస్తటిక్ సెన్స్ తో కొత్త తరహాలో చిత్రీకరించే వంశీ.. ఈ పాటలను ఎలా తీస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/