Begin typing your search above and press return to search.

బికినీలో మ్యారీడ్ హాటీ ఇలా రెచ్చిపోయిందే!

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:30 PM GMT
బికినీలో మ్యారీడ్ హాటీ ఇలా రెచ్చిపోయిందే!
X
తేజ డిస్క‌వ‌రీ అనిత గుర్తుందా? అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు లెండి. ఉద‌య్ కిర‌ణ్ స‌ర‌స‌న‌ `న‌వ్వునేను`లో క‌థానాయిక‌గా న‌టించింది. తొలి సినిమాతోనే తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఇక్క‌డ‌ వ‌రుస‌గా సినిమాల్లో న‌టించేసింది. అటుపై తెలుగు చిత్రాల్లో న‌టించినా భారీ ఆఫ‌ర్ల‌ని మాత్రం పొంద‌లేక‌పోయింది. త‌మిళ‌-క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న అనిత చివ‌రికి హిందీ చిత్రాల‌తో పాటు బుల్లితెర‌పైనా కెరీర్ ని సాగిస్తోంది.

నాగిన్ 3 ధారావాహిక‌తో బుల్లితెర‌పైనా పాపుల‌ర్ అయిన అనిత అటుపై త‌న స్నేహితుడు రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పైనే కెరీర్ సాగిస్తోంది. ఇక రెగ్యుల‌ర్ గా అనిత విదేశీ వెకేష‌న్ ఫోటోలు.. వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అనిత బుల్లితెర నిర్మాత‌ల‌తో స్నేహం చేస్తూ ఓ రేంజులోనే సెల‌బ్రేష‌న్ చేసుకుంటోంది. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా క‌పూర్ తో సాన్నిహిత్యం అనిత‌కు బుల్లితెర‌పై అరుదైన అవ‌కాశాలు తెచ్చి పెడుతోంది.

తాజాగా ఈ మ్యారీడ్ హాటీ మ‌రోసారి బికినీతో చెల‌రేగిపోయింది. బులుగు జిలుగు స‌ముద్ర‌పు అంచులో నిల‌బ‌డి నేవీ బ్లూ బికినీలో అనిత ఇచ్చిన ఫోజు కిర్రాక్ పుట్టిస్తోంది. ఆ క‌ళ్ల‌కు రేబాన్ ధ‌రించి అల్ట్రా పోష్ లుక్ లో వెర్రెక్కించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రం సోష‌ల్ మీడియాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.