Begin typing your search above and press return to search.

ఇంత వేడిగా చూస్తే ఆయ‌న ఫీల‌వ్వ‌రా?

By:  Tupaki Desk   |   28 Dec 2019 3:04 PM GMT
ఇంత వేడిగా చూస్తే ఆయ‌న ఫీల‌వ్వ‌రా?
X
అనిత హ‌స‌నందానీ ... ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. ఉద‌య్ కిర‌ణ్ స‌ర‌స‌న `నువ్వు నేను` అనే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించింది. `శ్రీ‌రామ్` అనే కాప్ డ్రామాలోనూ ఉద‌య్ కి జంట‌గా న‌టించింది. ఇక ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణానంత‌రం అత‌డు అంత పిరికివాడు కానే కాదు! అంటూ త‌న వాద‌న కూడా వినిపించింది ఈ బ్యూటీ. అదంతా గ‌తం అనుకుంటే.. వ‌ర్త‌మానంలో అనిత హిందీ టీవీ సీరియ‌ళ్ల‌తో ఫ్యాన్స్ అంద‌రికీ ట‌చ్ లో ఉంది. ఇటీవ‌ల నాగిన్ హిందీ టీవీ సీరియ‌ల్ తోనూ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ప‌నిలో ప‌నిగా ప‌లు హార‌ర్ టీవీ సీరియ‌ళ్లతో అంత‌ర్జాలంలో యూట్యూబ్ లో వీక్ష‌ణ‌కు అందుబాటులో ఉండ‌డంతో త‌న‌ను ఇంకా తెలుగు ఫ్యాన్స్ ఫాలో అవుతూనే ఉన్నారు.

ఇక అనిత ఏడాది క్రితం కొలీగ్ కం బోయ్ ఫ్రెండ్ రోహిత్ రెడ్డిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అత‌డితో లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ప‌లు ఫోటోలు- వీడియోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో ట్రెండింగ్ అయ్యాయి. అదంతా స‌రే కానీ.. ప్ర‌స్తుతం న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ మూవ్ మెంట్స్ కోసం విదేశాల‌కు వెళ్లిపోయిన అనిత ఇదిగో ఇలా స్నేహితుల‌తో క‌లిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

అంతేనా.. అక్క‌డ భ‌ర్త రోహిత్ రెడ్డి మిస్స‌యిన‌ట్టే క‌నిపిస్తోంది. కానీ ఏమిటో ఇలా స్నేహితుడు వికాస్ గుప్తా ఒడిలో కూచుని వామ్ గా చెల‌రేగిపోయి మ‌రీ ఫోజిచ్చింది అనిత‌. వెకేష‌న్ ఎంత పీక్స్ లో ఉందో.. ఎంత‌గా హీటెక్కిస్తోందో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాల్సిందే మ‌రి. గ‌త కొంత‌కాలంగా ముంబై వ‌దిలి దూరాతీరాల‌కు వెళ్లిపోయ‌న ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ నానా ర‌చ్చ చేస్తున్నారు. ఈ గుంపులో ఏక్తా క‌పూర్.. వికాస్ గుప్తా.. రిథిమా పండిట్ త‌దిత‌రులు సెల‌బ్రేష‌న్ మూడ్ లో చెల‌రేగుతున్నారు. వెకేష‌న్ లో గ‌డిపిన ఆ అరుదైన క్ష‌ణాల‌కు సంబంధించిన కొన్ని ఫోటోల్ని అనిత సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక ఈ ఫోటోలు చూస్తుంటే జాలీ ట్రిప్ ని అనిత ఏ రేంజులో ఎంజాయ్ చేస్తోందో అర్థ‌మ‌వుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. భ‌ర్త ఒడిలో కూచుని ఫోటో దిగిందా.. అదిరిపోయింది అంటూ కొంద‌రు పోస్టులు పెడుతున్నా అది భ‌ర్త కాదు స్నేహితుడు అని తెలిసింది కొంద‌రికే. ఇక ఈ ఫోటోకి అభిమానుల నుంచి ర‌క‌ర‌కాల‌ కామెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయి.