Begin typing your search above and press return to search.

పిల్లల కోసం శ్రీకాళహస్తికి వచ్చిన హీరోయిన్

By:  Tupaki Desk   |   20 Sept 2016 11:00 AM IST
పిల్లల కోసం శ్రీకాళహస్తికి వచ్చిన హీరోయిన్
X
ఏదైనా ప్రముఖ దేవాలయాల్ని హీరోలు.. హీరోయిన్లు సందర్శిస్తుంటారు. దర్శనం అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతుంటారు. అయితే.. ఇలాంటి సందర్భాల్లో పర్సనల్ విషయాల్ని చెప్పేవారు అరుదుగా ఉంటారు. ఒకప్పుడుతన అందచందాలతో యూత్ గుండెల్లో సెగలు రేపిన హీరోయిన్.. తాజాగా తాను గుడికి రావటానికి వెనుకున్న కారణాన్ని బయటపెట్టటం ఆసక్తికరంగా మారింది.

దశాబ్దానికి పైనే.. ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ అనిత. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ.. ఈ భామ తనదైన ముద్ర వేసేసింది. తాజాగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వచ్చారు. దేవాలయంలో రాహుకేతు పూజల్ని చేయించుకున్నారు. తనకు పిల్లలు పుట్టటం లేదని.. శ్రీకాళహస్తికి వచ్చిరాహుకేతు పూజలు చేస్తే.. సంతానం కలుగుతుందని చెప్పారని.. అందుకే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వచ్చినట్లుగా వెల్లడించారు.

చాలా రోజుల తర్వాత అనిత ఆర్పీ పట్నాయక్ స్వయంగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న మనలో ఒకడు సినిమాలో యాక్ట్ చేశారు. త్వరలో రిలీజ్ కానున్న ఈసినిమాలో ఆమె మళ్లీ కనిపించనున్నారు. గుళ్లకు హీరోలు.. హీరోయిన్లు రావటం మామూలే కానీ.. అనిత మాదిరి ఓపెన్ గా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పేవారు చాలా తక్కువ మందే. అనిత కోరిక ఫలించి.. ఆమె కడుపు పండితే బాగుండు.