Begin typing your search above and press return to search.
రజనీ కుమార్తెపై నెటిజన్ల ఫైర్ ఎందుకంటే!
By: Tupaki Desk | 11 March 2017 9:41 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా - కోలీవుడ్ యంగ్ హీరో బార్యగా ఐశ్వర్యకు మంచి పేరే ఉంది. భరతనాట్యంలో మంచి ప్రవేశం ఉన్న ఐశ్వర్యకు ఇటీవలే ఐక్యరాజ్య సమితి నుంచి మంచి గౌరవం లభించింది. లింగ సమానత్వం కోసం ఐరాస చేపడుతున్న కార్యక్రమాలకు ఐశ్వర్య గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాస... అమెరికా నగరం న్యూయార్క్ లోని తన కేంద్ర కార్యాలయంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేదికపై ఐశ్వర్య భరత నాట్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శనకు భారత మీడియా కొనియాడింది.
ఇదంతా జరిగి రెండు రోజులయ్యిందో, లేదో... ఐశ్వర్యపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐరాస వేదికపై ఐశ్వర ఇచ్చిన ప్రదర్శన భరత నాట్యమేనా... అంటూ ఓ ప్రముఖ డ్యాన్సర్ మొదలెట్టిన విమర్శ క్రమంగా సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారిపోయింది. ఐరాస వేదికపై ఐశ్వర్య చేసింది భరత నాట్యమే కాదని, అసలు భరతనాట్యం ప్రాముఖ్యతను కించపరిచేలా వ్యవహరించిందని కూడా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి నాందీ పలికిన వ్యక్తిగా ప్రముఖ డ్యాన్సర్ అనితా రత్నం నిలిచారు. భరతనాట్యంతో పాటు కథాకళి - మోహినియాట్టం తదితర నృత్య రీతుల్లోనూ ప్రావీణ్యం సంపాదించిన రత్నం... ఐశ్వర్య ప్రదర్శనపై విమర్శలు గుప్పించారు. ఐరాస వేదికపై భరత నాట్యం పేరిట ఐశ్వర్య కుప్పిగంతులు వేసిందంటూ ఐశ్వర్య ఫొటోను దానికి అటాచ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
ఐశ్వర్యపై రత్నం చేసిన కామెంట్లు - పోస్ట్ చేసిన ఫొటోను జత కలిపి ఏకంగా ఓ వీడియోనే తయయారైపోయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాస్తంత ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన రత్నం... ఈ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. రత్నం వివరణ ఇచ్చిన తర్వాత ఐశ్వర్యపై సెటైర్లు తగ్గుతాయని భావించగా, అందుకు భిన్నంగా విమర్శలు మరింతగా పెరిగాయి. ప్రముఖ తమిళ రచయిత పార్టీబన్ షణ్ముగం అయితే... ఐశ్వర్యను టార్గెట్ చేస్తూ ఘాటు కామెంట్లే చేశారు. భరతనాట్యం ప్రాముఖ్యతను తగ్గించేలా వ్యవహరించిన ఐశ్వర్యకు డ్యాన్స్ నేర్పిన గురువు... భవిష్యత్తులో మరెవరికీ డ్యాన్స్ నేర్పకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇక నెటిజన్లైతే.. రత్నం వ్యాఖ్యలున్న వీడియోను ఆధారం చేసుకుని ఐశ్వర్యపై విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీసేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/