Begin typing your search above and press return to search.

లేటు వయసులో ఘాటు లుక్

By:  Tupaki Desk   |   27 Jan 2016 7:30 AM GMT
లేటు వయసులో ఘాటు లుక్
X
అనితా చౌదరి.. టీవీ నుంచి వెండి తెరకు వచ్చి మంచి పాత్రలతో బాగానే వెలుతోందీ ఈమె. టాలీవుడ్ లో తెలుగమ్మాయిలు తక్కువగానే కనిపిస్తూ ఉంటారు. కానీ గుర్తింపు తెచ్చుకుని, చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అంటే దాదాపు 30 సినిమాలు చేసింది అనితా.

తాళి సినిమా టైంలోనే ఈమెకు హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చింది కానీ.. వేరే ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో వదులుకుంది. టీవీల్లో రియాలిటీ షోలు, సీరియల్స్ తో పాటు, సినిమాల్లో మంచి పాత్రలు వచ్చినపుడు నటిస్తూండడం ఆమెకు అలవాటు. అన్నట్లు.. ఈమె డ్యాన్సర్ కూడా. నాట్యం పై మక్కువతో ఇంట్లో చెప్పకుండానే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న ఈమె.. సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గానే ఉంటుంది. సొంతగా యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తుంటుంది.

అడపాదడపా చీరకట్టులోనే ఫోటో షూట్స్ చేయించుకోవడం అనితకు సరదా. అలా రీసెంట్ గా చేయించుకున్నదే ఈ బ్లాక్ డ్రస్ పోజులు. గతంలో చీరకట్టు నేర్పుతున్నా అన్నట్లుగా ఉండేవి కానీ.. ఈసారి ఎందుకో కొంచెం హాటుగా ట్రై చేసినట్లు అనిపిస్తోంది. స్లీవ్ లెస్ తో పాటు ట్రాన్స్ పరెంట్ శారీతో అట్రాక్ట్ చేస్తోంది. గతంతో పోల్చితే బొద్దుగా కనిపిస్తోందనే కామెంట్స్ పడుతున్నాయి. అయితే.. లేటు వయసులో అయినా ఇలా ఘాటుగా కనిపించడానికి చేసిన ప్రయత్నానికి మాత్రం ప్రశంసలు వచ్చాయి. ఇంతకీ ఈ ఘాటు లుక్ సరదా కోసమేనా?