Begin typing your search above and press return to search.

ఒకప్పటి వెంకీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

By:  Tupaki Desk   |   27 Feb 2023 8:00 PM GMT
ఒకప్పటి వెంకీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
X
తెలుగు సినీ పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలో యువరాణిలా మెరిసిపోవాలని అనేకమంది భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో చివరి వరకు నిలదొక్కునేది చాలా తక్కువ మంది మాత్రమే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తర్వాత కొన్ని సినిమాల వరకు మెరిసే భావాలు కొంతమంది ఉంటే మొదటి సినిమా డిజాస్టర్ అవడంతో కనుమరుగైపోయే వారు చాలామంది ఉంటారు.

అయితే మొదటి సినిమా హిట్ అయిన తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత కూడా పెళ్లి చేసుకుని కనుమరుగు అయిపోయిన వారి లిస్టులో అలనాటి హీరోయిన్ అంజలా జావేరి ఉంటారు ఈవిడెవరు అని అనుకోవచ్చు.

కానీ నటించిన చిత్రాలను గుర్తు చేస్తే కచ్చితంగా ఆవిడ మీకు గుర్తొస్తారు వెంకటేష్ హీరోగా ప్రేమించుకుందాం రా అనే సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా లంచ్ అయింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

గుణ శేఖర్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన చూడాలని ఉంది సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో అనేక సినిమాల్లో నటించింది. తెలుగు సహా కన్నడ తమిళ సినిమాల్లో కూడా భాగమైన ఆమె కెరీర్ మంచి పిక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ విలన్ తరుణ్ అరోరాని వివాహం చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.

పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఆమె మరోసారి ఇచ్చింది. ఆ సినిమాలో ఒక ప్రొఫెసర్ పాత్రలో ఆమె కనిపించింది.

అయితే ఆ తర్వాత ఎందుకు ఆమె మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశం దక్కలేదు. కానీ మంచి పాత్ర లభిస్తే ఆమె ఎప్పుడు నటించడానికి సిద్ధంగానే ఉంటుందని ఆమె భర్త తరుణోరో చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వాలెంటైన్స్ డే సందర్భంగా అంజలా జావేరి పోస్ట్ ఒకటి తరుణ్ అరవ షేర్ చేయగా అలనాటి హీరోయిన్ ఏమాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.