Begin typing your search above and press return to search.

పుట్టినరోజున జై కొట్టిన సీతమ్మ

By:  Tupaki Desk   |   8 April 2017 8:04 AM GMT
పుట్టినరోజున జై కొట్టిన సీతమ్మ
X
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒక్క సినిమాతో టాలీవుడ్ సీతమ్మగా మారిపోయింది అంజలి. ఆ సినిమా ఇచ్చిన బూమ్ ను వాడుకోలేకపోయింది కానీ.. గుర్తింపు మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం ఈ భామ మళ్లీ కోలీవుడ్ లోనే పాగా వేసేయగా.. అక్కడే ఓ తోడు వెతికేసుకుందనే టాక్ చాలా నెలల నుంచే వినిపిస్తోంది.

జర్నీ ఫేం తమిళ హీరో జై- అంజలి ప్రేమించుకున్నారని కోలీవుడ్ లో ఓపెన్ సీక్రెట్. అయితే.. వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫాం చేయరు కానీ.. కలిసి దోశలు వేసుకుని మరీ తినేస్తుంటారు. తాజాగా ఈ కుర్ర హీరో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వీటిని సెలబ్రేట్ చేసింది ఎవరో కాదు.. సీతమ్మే. జై షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయి మరీ.. తెగ హడావిడి చేసేసింది. కేకు ముక్కలు ప్రేమగా నోట్లో పెట్టి మరీ తినిపించింది. అక్కడ సెలబ్రేషన్స్ హంగామా అంతా అంజలిదే కావడం విశేషం. అంత క్లోజ్ గా వాళ్లిద్దరినీ చూసి.. అసలు వీళ్లకి పెళ్లి కాలేదంటే ఎవరూ నమ్మలేకపోయిన పరిస్థితి.

ప్రస్తుతానికి పైకి చెప్పడం లేదు కానీ.. త్వరలోనే ప్రేమ-పెళ్లిపై ఓపెన్ అయిపోనున్నారట జై- అంజలి. ఇప్పటికే అంజలికి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ వచ్చేయగా.. జై నుంచి మాత్రం ఇంకా పెళ్లి విషయమై స్పష్టత రాలేదని అంటున్నారు. అయితే.. వచ్చే ఏడాది వీరిద్దరి మ్యారేజ్ జరిగే అవకాశాలున్నాయన్నది లేటెస్ట్ టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/