Begin typing your search above and press return to search.

​పెళ్లీ చేసుకొను.. రాజకీయాల్లోకీ రాను..

By:  Tupaki Desk   |   19 Aug 2017 5:18 AM GMT
​పెళ్లీ చేసుకొను.. రాజకీయాల్లోకీ రాను..
X
సినిమా స్టార్ మాటలను వారి పనులను అతి ఉత్సాహంతో చూపిస్తూ ప్రసారం చేస్తుంటారు మన మీడియా మిత్రులు. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రి డ్రగ్స్ వివాదం విషయంలో కూడా అలానే చేశారు. ఇప్పుడు అసలు ఏమి జరగలేదు అన్నట్లుగా అందరూ మరచిపోయారు దాన్ని. అలానే ఈ వివాదం జరుగుతున్నప్పుడు ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి సంబందించిన కొంతమంది పై అనుమానం వ్యక్తపరిచారు. ఇప్పుడు అదేమాదిరి మన తెలుగు అమ్మాయి అంజలి.. పెళ్లి - రాజకీయం ఎంట్రీ విషయంలో కూడా అలానే చేస్తున్నారు.

అంజలి రాజకీయాలలోకి రాబోతోందని ఈ మధ్య పుకారులు జోరుగా సాగాయి. అసలు ఈ వార్త రావడానికి ప్రధాన కారణం ఆమె మన దేశ రాజధానిలో ఉన్న పార్లమెంట్ను విజిట్ చేసి రావడమే. కొద్ది వారాల కిందట ఏదో పనిమీద పార్లమెంట్ కు వెళ్ళి వచ్చిన సంగతి మీడియా దృష్టిలో పడింది. ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరబోతోందని ఒకవైపు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు కాబట్టి.. ఆయన కొత్తగా పెట్టె పార్టీలో అంజలి చేరబోతోందని మరోవైపు ప్రచారం జరిగింది. “నేను రాజకీయాల్లోకి వస్తాను అనే వార్త ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. నేను ఇప్పటిలో అటువంటి నిర్ణయాలు తీసుకోబోవటం లేదు. నేను రాజకీయాలలోకి రావటం లేదు. ఇప్పటిలో పెళ్లీ కూడా చేసుకోబోవటం లేదు” అని చెప్పిందీ రాజోల్ బ్యూటి.

తెలుగు సినిమాలలో కన్నా తమిళ్ సినిమాలో మంచి నటిగా పేరున్న అంజలి ఇప్పుడు ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గీతాంజిలి సినిమా తరువాత తెలుగులో అంజలికి ఒక్క హిట్ కూడా లేదనే చెప్పాలి. ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా అవి ఏవి అంతగా తన కెరియర్ కి ఉపయోగపడలేదు. ప్రస్తుతం అంజలి నటించిన కొన్ని తమిళ్ సినిమాలు విడుదల కావడానికి సిద్దంగా ఉన్నాయి.​