Begin typing your search above and press return to search.

గంటలు గంటలు షూటింగ్‌ లో సీతమ్మ

By:  Tupaki Desk   |   17 Nov 2015 6:02 AM GMT
గంటలు గంటలు షూటింగ్‌ లో సీతమ్మ
X
టాలీవుడ్ సీత‌మ్మ అంజ‌లి ట్రాక్ రికార్డ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు వివాదాలు రెండిటినీ ప్యార‌ల‌ల్‌ గా న‌డిపించిన హీరోయిన్‌ గా పాపుల‌రైంది. ముఖ్యంగా పిన్ని భార‌తీతో, బాబాయ్ క‌ళాంజియంతో గొడ‌వ‌ప‌డి, ఓ సినిమా షూటింగు నుంచి అదృశ్య‌మైన విష‌యం పెద్ద సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ త‌ర్వాత కూడా అంజ‌లి ప్ర‌తిభ‌పై న‌మ్మ‌కంతో మ‌న ద‌ర్శ‌క‌నిర్మాతలు అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. త‌మిళంలోనూ అవ‌కాశాలొస్తున్నాయి. అయితే ఇప్ప‌టికీ పాత వాస‌న‌ల్ని త‌మిళ మీడియా మ‌ర్చిపోవ‌డం లేదు. అంజ‌లి ఇమేజ్‌ ను ఏదోవిధంగా డ్యామేజ్ చేసేందుకు య‌త్నిస్తోంది.

ఇటీవ‌లే అంజ‌లి న‌టించిన సకలకళావల్లవన్ తో కోలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చినా అది పెద్ద ఫ్లాపైంది. దీన్ని చిలువ‌లు ప‌లువ‌లుగా కోలీవుడ్ మీడియా ప్ర‌చారం చేసింది. అంజ‌లి వ‌ల్లే ఇలా జ‌రిగిందా? అన్న ప్ర‌చార‌మూ సాగించాయి. అంతే కాదు ఇటీవ‌లి కాలంలో అంజ‌లి క‌నిపించ‌డం లేదు... అన్న ప్ర‌చారాన్ని నెత్తికెత్తుకుంది కోలీవుడ్ మీడియా, దీనిపై ఫైర‌వుతూ అంజ‌లి ఈరోజు క్లారిటీనిచ్చింది. నేనేమీ క‌నిపించ‌కుండా పోలేదు. అవ‌కాశాల్లేవ‌ని ప్ర‌చారం చేస్తున్నారు అదీ నిజం కాదు.. అంటూ చెప్పుకొచ్చింది.

''ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో బిజీ. బాల‌య్య‌బాబు స‌ర‌స‌న డిక్టేట‌ర్ కోసం ఏక‌ధాటిగా 21 గంట‌లు షూటింగులో పాల్గొన్నా. బ‌న్ని స‌ర‌స‌న‌ స‌రైనోడు కోసం 23 గంట‌లు ప‌నిచేశాను. నా రికార్డును నేనే బ్రేక్ చేసుకుంటూ మ‌రో చిత్రం చిత్రాంగధ కోసం 44 గంటలు కంటిన్యూగా నటించాను..'' అంటోంది అంజలి. తమిళంలో కూడా మాప్పిళై సింగం - ఇరైవి - తరమణి చిత్రాల్లో నటిస్తున్నాన‌ని అంజలి చెబుతోంది. దీన్ని బ‌ట్టి అంజ‌లిపై త‌మిళ మీడియా కావాల‌నే చెడు ప్ర‌చారం చేస్తోంద‌ని అర్థం కావ‌డం లేదూ?