Begin typing your search above and press return to search.
రాజోలు పాప... మజాకా?
By: Tupaki Desk | 9 July 2015 11:32 AM GMT ఎక్కడైనా దర్శకనిర్మాతలకి ఇష్టమైన చోటే సినిమాలు తీస్తారు. వాళ్లు రమ్మన్న చోటుకే హీరో హీరోయిన్లు, మిగతా టీమ్ అంతా వెళ్లి షూటింగ్ చేసొస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. నాకు ఇష్టమైన చోటే సినిమా తీయాలని షరతు విధించింది హీరోయిన్. అలాగైతేనే షూటింగ్‌కొస్తా లేదంటే లేదంతే అని తెగేసి చెప్పింది. ఇంత క్లారిటీగా చెప్పాక వాళ్లు మాత్రం ఏం చేస్తారు. హీరోయిన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికే వచ్చి సినిమా తీయడానికి సిద్ధమైపోయారు. ఇంతగా షరతు విధించిన హీరోయిన్ ఎవరో కాదు.. మన రాజోలు పాప అంజలి. ఇప్పుడు అనాల్సిందే కదా మరి రాజోలు పాపా మజాకా అని. అయితే అలా కండిషన్ పెట్టడానికి బలమైన కారణం కూడా ఉందిలెండి. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకొందాం.
అంజలి ఆమధ్య తమిళంలో ఓ సినిమాకి కాల్షీట్లు ఇచ్చేసింది. అయితే ఆ టీమ్ అనుకొన్న సమయానికి సినిమా చేయలేకపోయింది. దీంతో అంజలి కాల్షీట్లు వృథా అయిపోయాయి. ఇప్పుడు మళ్లీ కొత్తగా కాల్షీట్లు అడిగితే 'ఇంకెక్కడి కాల్షీట్లు మీకు ఇచ్చిన టైమ్ అయిపోయింది కదా' అని చెప్పేసిందట అంజలి. కానీ వాళ్లు మాత్రం 'మీరు కాల్షీట్లు ఇవ్వాల్సిందే, లేదంటే మేం నష్టపోతాం' అని మొరపెట్టుకొన్నారట. ఇక చేసేదేం లేక అంజలి ఓ కండిషన్‌తో కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ కండిషన్ ఏంటంటే... సినిమా తనపై సీన్స్‌ని హైదరాబాద్‌లోనే తీయాలని. చెన్నైలో షూటింగ్ పెట్టుకొంటానంటే మాత్రం రానని తెగేసి చెప్పిందట. దీంతో ఆ చిత్రబృందం చేసేదేమీ లేక హైదరాబాద్‌లోనే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. అదీ సంగతి!