Begin typing your search above and press return to search.

మీడియాకి కండిషన్స్ పెట్టిన తెలుగు గాళ్

By:  Tupaki Desk   |   20 Feb 2017 7:47 AM GMT
మీడియాకి కండిషన్స్ పెట్టిన తెలుగు గాళ్
X
సహజంగా సినిమా సెలబ్రిటీలపై బోలెడన్ని రూమర్స్ వస్తుంటాయి. ఇందుకు తగినట్లుగా వాళ్ల దగ్గర ఏదో క్లూ ఉంటుంది. దాన్ని పట్టుకుని చిలువలు పలువలుగా రాసేస్తుంటారు. వీటన్నిటిపై ఆయా తారలను అడిగే అవకాశం అన్నిసార్లు మీడియాకు చిక్కదు. దొరికినప్పుడు మాత్రం అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధపడరు.

సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చిన తర్వాత.. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు తప్పనిసరి పరిస్థితుల్లో సమాధానాలు చెబుతుంటారు. కానీ తెలుగు హీరోయిన్ అంజలి మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంది. ఈ భామ నటించిన మూవీ చిత్రాంగద త్వరలో రిలీజ్ కానుంది. తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఇంటర్వ్యూలు.. ప్రెస్ మీట్లు పెడుతుందట కానీ.. ఈమెను మాత్రం వ్యక్తిగత విషయాలను వేటినీ అడగకూడదట. అసలు తన పాత వివాదాల గురించి కానీ.. కొత్త సాన్నిహిత్యాల గురించి కానీ అంజలిని అడగకూడదట.

మీడియా జనాలు ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే వారి ముందుకు వస్తానని తెగేసి చెబుతోంది అంజలి. అంటే అంజలి చెప్పేదేంటంటే.. ఈమెకు పిన్నితో ఉన్న విబేధాలు.. దర్శకుడు కళాంజియంతో ఉన్న గొడవలు.. రీసెంట్ గా తమిళ హీరో జై తో కలిసి దోశలు వేయించుకు తినడాలు.. ఇలాంటివేమీ ప్రశ్నల్లో ఉండకూడదట. ఆమె చెప్పింది మాత్రం విని తల ఊపేయాలన్నది బ్యూటీ అంజలి చెప్పే మాటల పరమార్ధం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/