Begin typing your search above and press return to search.

మరో హీరోయిన్ చెల్లి ఎంట్రీ

By:  Tupaki Desk   |   24 Sep 2017 3:30 AM GMT
మరో హీరోయిన్ చెల్లి ఎంట్రీ
X
సినిమా ఇండస్ట్రీలో హీరోల ఫ్యామిలీ నుంచి అనేక మంది తెరపై కనిపిస్తున్నారు . కానీ హీరోయిన్స్ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎక్కువగా రారు. ఒకవేళ వచ్చినా ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా హీరోయిన్స్ సిస్టర్స్ వచ్చిన కొన్నే రోజులకే ఛాన్సులు తగ్గితే మళ్లీ కనిపించరు. అయినా సరే వారి అదృష్టాన్ని పరీక్షించుకొని ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇప్పటివరకు వచ్చిన వారు టాప్ హీరోయిన్స్ సిస్టర్సే. సిమ్రాన్ చెల్లి జ్యోతిక.. కాజల్ చెల్లి నిషా.. సంజన చెల్లి నిక్కి.. అబ్బో లిస్ట్ బాగానే ఉంది.

అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఒక తెలుగు హీరోయిన్ చెల్లెలు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగులు వేస్తోంది. ఆమె ఎవరో కాదు అంజలి కజిన్ సిస్టర్ " ఆరాధ్య". ఇప్పటివరకు అంజలి చాలా సినిమాల్లో నటించింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు.. గీతాంజలి వంటి సినిమాలతో హిట్లు కొట్టింది. కాని పెద్ద పెద్ద ఆఫర్లు మాత్రం రాలేదు. చివరగా సరైనోడులో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఇక తెలుగులో అంతగా సక్సెస్ కాకపోయినా తమిళ్ లో మాత్రం చాలావరకు సక్సెస్ అయ్యింది. అక్కడే ఎక్కువగా ఉంటోంది. ఫైనల్ గా జై ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఆమె స్థానాన్ని చెల్లి ఆరాధ్య భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఎంట్రీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుందట.

సముద్ర దర్శకత్వంలో తమిళ్ లో ఓ సినిమా ను ఒకే చేసిందట ఆరాధ్య. ఆ సినిమా గురించి త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తానని ఈ నయా హీరోయిన్ చెప్పింది. పైగా అక్క అంజలి టైపులో కాకుండా.. గ్లామరసం చిందించడానికి తాను క్యూలో మొదటి లైన్లోనే ఉన్నానంటోంది.