Begin typing your search above and press return to search.
మలయాళంపై కన్నేసిన ఈగో పిల్ల
By: Tupaki Desk | 30 Aug 2017 7:07 AM GMTఈగో అంటే ఇంగ్లీష్ ఈగో కాదండోయ్. మనం ముద్దుగో తెలుగులో తూగో అంటూ పిలుచుకుంటామే... ఆ తూర్పు గోదావరిని ఇలా క్యూట్ గా ఈస్ట్ గోదావరి అంటున్నారు సినిమా లవ్వర్స్. ఒకప్పుడు తెలుగు హీరోయిన్స్ టాలీవుడ్ లో తెగ పాపులర్ అయ్యేవారు . కానీ ప్రస్తుత రోజుల్లో నార్త్ భామల డామినేషన్ ఎక్కువ అయ్యేసరికి తెలుగు తారలు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఎదో స్టార్ హోదాను అలా గడిపేస్తున్నారు. అంతే కాకుండా మలయాళీ ముద్దుగుమ్మలు కూడా ఈ మాద్య బాగా పాపులర్ అవుతున్నారు నార్త్ అందాలకు ధీటుగా అందాలను ఆరబోస్తూ.. పోటీని ఇస్తున్నారు.
అయితే ఈస్ట్ గోదావరి అంజలి మాత్రం కోలీవుడ్ జనాలను ఆకర్షించేసి అక్కడ మంచి సినిమాలతో రానించింది. కానీ ఏమైందో ఏమో గాని తెలుగులో మాత్రం స్టార్ హీరోలతో అంతగా కనెక్ట్ అవ్వడం లేదు. కానీ తమిళ హీరోలతో మాత్రం చిందులేస్తోంది. ముఖ్యంగా ఎంగేయుం ఎప్పోదుం (తెలుగులో జర్నీ).. అంగాడి తెరు (తెలుగులో షాపింగ్ మాల్) వంటి పలు హిట్ చిత్రాల్లో నటించి ఆకర్షించింది. కానీ ఆ మధ్యన కొంచెం కోలీవుడ్ కి గ్యాప్ ఇచ్చినా మళ్లీ మరో హిట్ తో తమిళ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే ఇప్పుడు ఆమె అందాలతో మలయాళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమైపోయింది. అదికూడా ఒక కామెడీ చిత్రంలో నటించడం ఆమె అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే కేరళా హాజీ చిత్రాలకు నేషనల్ మార్కెట్ గట్టిగానే ఉంది.
‘రోసాప్పూ’ అనే కామెడీ చిత్రంలో అంజలి నవ్వించడానికి రెడీ అయిపొయింది. ఈ చిత్రం కోసం దర్శకుడు తెగ కష్టపడుతున్నాడట. ఎందుకంటే 143 పాత్రలతో కూడిన కథను అల్లాడట ఆ చిత్ర దర్శకుడు విను జోసెఫ్. ఇక అంజలి ఈ సినిమాలో సగం తమిళ్- సగం కన్నడ బాషా వచ్చిన ఒక కథానాయికగా కనిపించనుందట. చూద్దాం మరి అంజలి మలయాళీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో!!