Begin typing your search above and press return to search.
చరణ్‌నే కాదంది.. పైగా కోటి కావాలంది
By: Tupaki Desk | 21 Jan 2015 4:13 AM GMTటాలీవుడ్‌లో బాక్సాఫీస్ కింగ్‌గా రామ్‌చరణ్ పేరు తెచ్చుకున్నాడు. పోస్టర్‌లో అతడి బొమ్మ కనిపిస్తే చాలు.. జనాలు థియేటర్లకు క్యూ కట్టేస్తున్నారు. చరణ్ నటించిన సినిమా యావరేజ్ అన్న టాక్ వచ్చినా కనీసంగా 50కోట్లు వసూళ్లు షురూ. అంతటి క్రేజు ఉన్న హీరోగా చరణ్‌కి పేరుంది. ఇటీవలే అతడు నటించిన గోవిందుడు అందరివాడేలే యావరేజ్ చిత్రంగా టాక్ తెచ్చుకున్నా కనీస వసూళ్లు దక్కాయంటే మెగాభిమానుల బలం పుష్కలంగా ఉంది కాబట్టే.
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించడానికి రంగం సిద్ధమవుతోంది. నా పేరు రాజు అనేది టైటిల్. సమంత కథానాయిక అన్న టాక్ వినిపిస్తోంది. ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. శ్రీనువైట్ల ఆ పనిలో పూర్తి బిజీగా ఉన్నారు. అంతేకాదు.. ఈ చిత్రంలో ఓ ఐటెమ్ నంబర్‌లో నర్తించాల్సిందిగా టాలీవుడ్ సీతమ్మ అంజలిని శ్రీను కోరాడట. ఓ కండిషన్ మీద అయితే ఐటెమ్‌కి ఓకే చెబుతానని కరాఖండిగా చెప్పేసిందిట అంజలి. కేవలం ఐటెమ్ మాత్రమే కాదు చరణ్ కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలు కావాలి. లేదంటే కోటి ముట్టజెప్పాల్సిందే అంటూ పట్టుబట్టిందిట.
దాంతో చరణ్, శ్రీనువైట్ల షాక్‌కి గురయ్యారని సమాచారం. ఇంత నిక్కచ్ఛిగా అంజలి మాట్లాడేస్తుందని ఊహించని ఈ ఇద్దరూ పరేషాన్ అవుతున్నారని ఫిలింనగర్ టాక్. అయితే వైట్లతో గొడవపడి అతడి కొలువు నుంచి బైటికి వచ్చేసిన కోన వెంకట్ అంజలి(గీతాంజలి స్నేహం)తో ఇలా మాట్లాడిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.