Begin typing your search above and press return to search.

సరైనోడు తెలుగు ఐటెమ్ కి బ్రేకిస్తాడా?

By:  Tupaki Desk   |   16 April 2016 10:01 AM IST
సరైనోడు తెలుగు ఐటెమ్ కి బ్రేకిస్తాడా?
X
తెలుగమ్మాయి అంజలి కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకుని, టాలీవుడ్ లో సగర్వంగా అడుగుపెట్టింది. ఆరంభం అదుర్స్ అనిపించేలా ఉన్నా.. కీలకమైన స్టేజ్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ కారణంగా వెనకబడింది. మళ్లీ రికవర్ అయ్యేందుకు తెగ ట్రై చేస్తోంది అంజలి.

నందమూరి బాలకృష్ణ సరసన డిక్టేటర్ లో కీలక పాత్ర చేసినా ఈ భామకు పెద్దగా అచ్చి రాలేదు. సినిమా యావరేజ్ అయినా, అంజలికి మాత్రం దక్కిందేమీ లేదు. దీంతో ఇప్పుడీ భామ తన ఆశలన్నీ అల్లు అర్జున్ పైనే పెట్టుకుంది. సరైనోడు మూవీలో బ్లాక్ బస్టరే అంటూ సాగే ఐటెం సాంగ్ లో చిందులేసింది ఈ సుందరి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

గతంతో పోల్చితే పర్సనాలిటీ పై కూడా కొంచెం దృష్టి పెట్టడంతో.. అమ్మడి ఫిజిక్ లో కూడా మార్పు వచ్చింది. బొద్దుగా ఉండే అంజలి.. ఐటెం సాంగ్ సుందరాంగులకు పోటీ ఇచ్చే రేంజ్ లో మారిపోయింది. ఇప్పుడీ సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే.. ఈ భామ ఆడిపాడిన బ్లాక్ బస్టరే సాంగ్ కి కూడా గుర్తింపు వస్తుంది. అందుకే ఇప్పుడీ చిన్నదాని ఆశలన్నీ సరైనోడిపైనే ఉన్నాయి.