Begin typing your search above and press return to search.

అంజ‌లికి ఇలాగ‌న్నా బ్రేక్ వ‌స్తుందా?

By:  Tupaki Desk   |   18 Sep 2022 2:30 AM GMT
అంజ‌లికి ఇలాగ‌న్నా బ్రేక్ వ‌స్తుందా?
X
అంజ‌లి గ‌త కొంత కాలంగా మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌త్యేక ఐట‌మ్ సాంగ్ ల‌కు కూడా సై అంటూ మెస్మ‌రైజ్ చేయాల‌ని ట్రై చేస్తోంది. ఇటీవ‌ల నితిన్ న‌టించిన 'మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం'లో 'రాను రానంటూనే చిన్న‌దో...' అంటూ సాగే పాట‌లో ప్ర‌త్యేకంగా ఐట‌మ్ గాళ్ గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. అయితే అంజ‌లి దుర‌దృష్ట‌మో ఏమో గానీ ఆ సినిమా ఆడ‌లేదు. కానీ ఈ పాట హిట్ కావ‌డంతో అంజ‌లికి మంచి పేరొచ్చింది.

సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో వెబ్ సిరీస్ ల బాట ప‌డుతోంది. న‌వ‌ర‌స‌, ఝాన్సీ, బ‌హిష్క‌ర‌ణ వంటి వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది. తాజాగా అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన వెబ్ డ్రామా 'ఫాల్‌'.

సిద్దార్ధ్ రామ‌స్వామి ఈ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తాజాగా ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. ఈ సిరీస్ ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అంజ‌లితో పాటు ఈ వెబ్ డ్రామాలో ఎస్.పి.బి. చరణ్, సోనియా అగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమితా కృష్ణమూర్తి, తలైవాసల్ విజయ్, పూర్ణిమ భాగ్యరాజ్ త‌దితరులు న‌టించారు.

ఆత్మహత్యాయత్నానికి 24 గంటల ముందు ఓ యువ‌తి త‌న జ్ఞాప‌కాల‌న్నింటినీ కోల్పోతుంది. ఈ స‌మ‌యంలో మెల‌కుల‌లోకి వ‌చ్చిన యువ‌తి త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు స్నేహితులు, స‌న్నిహితుల‌ని కూడా న‌మ్మ‌దు.

అయితే ఈ 24 గంట‌ల్లో ఏం జ‌రిగిందో ఆ యువ‌తి తెలుసుకునే నేప‌థ్యంలోనే ఈ సిరీస్ సాగుతుంది. ఇంటెన్స్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కి సిద్ధార్ధ్ రామ‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా సినిమాటోగ్రాఫ‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు.

అజేష్ సంగీతం అందించ‌గా కృష్ణ సి చెజియ‌న్ ఎడిటింగ్ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించాడు. ఈ సిరీస్ ని అవార్డ్ విన్నింగ్ వెబ్ సిరీస్ 'వెర్టిజ్‌' అడాప్టేష‌న్ తో రూపొందించారు. గ‌త కొంత కాలంగా సినిమాలు లేక‌పోవ‌డంతో వ‌రుస‌గా వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తున్న అంజ‌లికి ఇలాగ‌న్నా బ్రేక్ వ‌స్తుందా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే అంజ‌లి ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్ లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న భారీ మూవీలో న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.