Begin typing your search above and press return to search.

60 కోట్ల సక్సెస్ ని ఎంజాయ్ చేయట్లేదే?

By:  Tupaki Desk   |   11 May 2016 5:30 PM GMT
60 కోట్ల సక్సెస్ ని ఎంజాయ్ చేయట్లేదే?
X
సమ్మర్ స్పెషల్ ఊరమాస్ మూవీగా వచ్చిన సరైనోడు సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు.. మాస్ సినిమాల దమ్ము ఎంతుందో చూపించాడు సరైనోడు. ఇదే సమయంలో ఇండస్ట్రీ టాప్ ఫైవ్ రేంజ్ కి చేరుకోవడం.. రెండు వారాల తర్వాత వచ్చిన రెండు సినిమాలు హిట్ అయినా.. పోటీపడి వసూళ్లు సాధిస్తుండడం.. సరైనోడు సాధించిన ఘనత.

మరి స్టైలిష్ స్టార్ సాధించిన సరైనోడు విజయాన్ని తెలుగమ్మాయి అయిన ఎంజాయ్ చేయలేకపోతోంది. అసలీ మూవీకి ప్రచారం అంజలితోనే ప్రారంభించారు. బ్లాక్ బస్టర్..బ్లాక్ బస్టరే అంటూ ఐటెం సాంగ్ కి స్టెప్పులేసింది అంజలి. మొదటగా జనాల్లోకి వెళ్లినది కూడా ఈ ఐటెం సాంగే. ఇప్పటికీ సరైనోడు యూనిట్ అంతా ప్రమోషన్స్ లో ఎక్కడికి వెళ్లినా బ్లాక్ బస్టర్ పాటలోని సిగ్నేచర్ స్టెప్ వేస్తున్నారు. హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ - కేథరిన్ లు కూడా ఈ స్టెప్ వేసి అభిమానులను అలరిస్తున్నారు. సినిమాలో ఎక్కడా ఈ హీరోయిన్లు బ్లాక్ బస్టర్ సాంగ్ కి స్టెప్స్ వేయకపోయినా.. బైట మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంజలి మాత్రం ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించడం లేదు.

అసలు మూవీ ప్రచారానికి ఈ తెలుగమ్మాయి ఒకసారి కూడా రాలేదు. కెరీర్ లో 60కోట్ల షేర్ సాధించిన మూవీ ఉండడమంటే.. అదో బిగ్గెస్ట్ అఛీవ్ మెంట్ అనాలి. అలాంటి రికార్డును అందించిన సరైనోడు విజయంలో ఒక శాతం కూడా అంజలికి దక్కడంలేదనిపిస్తోంది. మరి సరైనోడు యూనిట్ తో అంజలి కలవడం లేదో.. లేక ఐటెం సాంగ్ మాత్రమే చేసిందని అంజలిని నిర్మాత అల్లు దూరం పెట్టాడో మాత్రం అర్ధం కాని విషయమే.