Begin typing your search above and press return to search.
అంజలి బాగా మారిపోయింది
By: Tupaki Desk | 11 Jan 2016 6:55 AM GMTఇదివరకు బాగా బొద్దుగా కనిపించేది అంజలి. ఆమెని చూసి కుర్ర హీరోల సరసన నటించే అవకాశాలు రావడం కష్టమే అనుకునేవారు. ఆ మాటలు అంజలి చెవిన పడ్డాయేమో తెలియదు. ఇటీవల ఆమె బాగా స్లిమ్ గా తయారయ్యింది. ఆరేడు కిలోలకి పైగా తగ్గిందట. ఆ బరువంతా కూడా నోరు కట్టేసుకొని, వ్యాయామాలు చేసే తగ్గిందట. అయితే అంజలి శారీరకంగా మాత్రమే మారలేదండోయ్. మానసికంగా కూడా ఆమెలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. డిక్టేటర్ ప్రమోషన్స్ లో భాగంగా అంజలి మీడియా ముందుకొచ్చింది. ఆమె మాట తీరు, దూకుడు ఇదివరకటితో పోలిస్తే పూర్తిగా మారిపోయినట్టు అనిపించింది.
తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో అంజలి కాస్త అల్లరిగా, గడుసమ్మాయిలాగా కనిపించేది. మాట తీరులోనూ కాస్త నిర్లక్ష్యం కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె చాలా కూల్ అయిపోయింది. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతోంది. బహుశా మానసికంగా వచ్చిన పరిణతి ప్రభావం కావొచ్చు. మసాలా - బలుపు సినిమాల సమయంలో ఆమె కొన్ని వివాదాల్లో కూరుకుపోయింది. ఆ ఎపిసోడ్ కూడా అంజలిలో మార్పుకు కారణమై ఉండొచ్చు. ఇదివరకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించేది కాదు. ఇప్పుడు తెలుగు - తమిళ భాషల్లో వరుసగా అవకాశాల్ని అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మలయాళంలోనూ పాగా వేసింది. తెలుగమ్మాయినైన నేను తొమ్మిదేళ్లుగా కథానాయికగా రాణిస్తుండడం హ్యాపీ అంటోంది అంజలి.