Begin typing your search above and press return to search.

అంజలి కోసం బాలయ్య వెంటబడ్డాడా?

By:  Tupaki Desk   |   12 Jan 2016 6:51 AM GMT
అంజలి కోసం బాలయ్య వెంటబడ్డాడా?
X
తెలుగమ్మాయి అయినా.. తమిళ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్. ఇప్పుడీ భామకు సీనియర్ హీరోల నుంచి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. యాక్టింగ్ విషయంలో కూడా ఇప్పటికే ప్రూవ్ చేసుకోవడంతో.. ఆఫర్స్ విషయంలో కొదువ లేదు. కానీ స్టార్ హీరోల రేంజ్ కి ఈమె ఎదగడానికి ప్రధాన కారణం.. తెలుగులో సీనియర్ హీరోలకి హీరోయిన్ల కొరత ఉండడమే. కొత్త హీరోయిన్లు ఎవరూ.. సీనియర్ స్టార్ల పక్కన నటించేందుకు ముందుకు రావడం లేదు. తమని చిన్న హీరోలు పక్కన పెట్టేస్తారనే ఫీలింగ్ ఇందుకు కారమం.

అలా అంజలి ట్యాలెంట్ కంటే.. ఇండస్ట్రీలో కనిపిస్తున్న లోటు కారణంగా.. అంజలికి అవకాశాలు వరుసగా దక్కుతున్నాయన్న మాట వాస్తవం. ప్రతీ సినిమాకి కొత్త హీరోయిన్ ని పట్టుకొచ్చిన చరిత్ర ఉన్న వెంకీ కూడా... వరుసగా ఆఫర్ చేసేందుకు ఇదే రీజన్. కానీ అంజలి మాత్రం అంతా తన ప్రతిభే అనుకుంటున్నట్లుగా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ సరసన అంజలి నటించిన డిక్టేటర్ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అంజలి నటనను కూడా బాలయ్య బాగానే ప్రశంసించాడు. అయితే.. ఈమె మాత్రం తాను బాలకృష్ణ పక్కన ఎప్పుడో నటించాల్సి ఉందని అంటోంది. బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్ లో రాధికా ఆప్టే చేసిన పాత్రకు మొదటి అంజలినే అడిగారట. అయితే కుదరలేదట.

ఆ తర్వాత లయన్ కోసం కూడా నిర్మాతలు అంజలిని అప్రోచ్ అయ్యారట. కానీ డేట్స్ ప్రాబ్లెం వల్ల చేయలేకపోయిందట. చివరకు ఇలా డిక్టేటర్ తో తమ కాంబినేషన్ సెట్ అయిందని చెబుతోంది. అంజలి... అంటే ఈమె చెప్పేదేంటంటే.. బాలయ్యకు మొదటి ప్రిఫరెన్స్ అంజలినే అని. రెండు సినిమాల్లో చేయను పొమ్మన్నా.. మళ్లీ ఏరి కోరి బాలయ్య తననే ఎంచుకున్నారని చెబుతోంది. నిజమేనంటారా? నమ్మొచ్చంటారా?