Begin typing your search above and press return to search.

నాకా.. ఓంకార్ తోనా.. ప్చ్‌

By:  Tupaki Desk   |   11 Jan 2016 8:14 AM GMT
నాకా.. ఓంకార్ తోనా.. ప్చ్‌
X
తెలుగు భామ అంజలి సంక్రాంతి పండుగ కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఒకవైపు పండుగ వేడుకలతోపాటు.. ఈ సారి బాలకష్ణతో కలిసి నటించిన డిక్టేటర్ విడుదల కానుండడంతో.. డబుల్ ధమాకా వస్తోంది ఈ వయ్యారికి. ప్రస్తుతం డిక్టేటర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ సుందరి.. కాసిన్ని పర్సనల్ సంగతులు కూడా పంచుకుంటోంది.

రీసెంట్ గా ఈమెపై రూమర్స్ బాగానే పెరిగాయి. యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారిన ఓంకార్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతోందన్నది.. లెటెస్ట్ గాసిప్. దీనిపై అంజలిని ప్రశ్నిస్తే.. 'ఈ మాట నేను ఇప్పుడే వింటున్నా. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నేను ఓంకార్ ని ఇప్పటివరకూ ఒక్కసారి కూడా కలవలేదు. ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్ధం కాదు' అంటూ షాకిచ్చింది అంజలి. ఈ రూమర్స్ వచ్చినపుడు తాను విదేశాల్లో ఉండడంతో.. వెంటనే సమాధానం చెప్పే అవకాశం రాలేదట. అందుకే వివరణ ఇవ్వడంలో లేట్ అయిందని వివరించింది అంజలి. మరి శంకరాభరణం ఫ్లాప్ సంగతేంటి అంటే.. దానికి ఇంకో వెర్షన్ చెప్పిందీమె.

తన సినిమా ఫ్లాప్ అయితే చాలా నిరుత్సాహపడతానన్న అంజలి.. శంకరాభరణం విషయంలో మాత్రం హ్యాపీగా ఉందట. సినిమా నిరుత్సాహపరిచినా, తను పోషించిన మున్నీ రోల్ కి మాత్రం విపరీతమైన ప్రశంసలు దక్కాయంటోంది. ప్రేక్షకులతోపాటు క్రిటిక్స్ కూడా తన పెర్ఫామెన్స్ ను పొగిడారని, అయినా.. ఇప్పుడు తన దృష్టంతా డిక్టేటర్ పైనే ఉందని చెబుతోంది. అలాగే తన కుటుంబంతో వచ్చిన విబేధాలు కూడా అన్నీ పరిష్కరించేసుకుందట. అమ్మ, ఇద్దరు సోదరులు, ఒక అక్క.. అందరిలోకి చిన్నదైన తాను.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటోంది అంజలి.