Begin typing your search above and press return to search.
ఫ్రెండంటోంది.. ప్రియుడితో చెడిందా?
By: Tupaki Desk | 19 Dec 2017 8:39 AM GMTఆ మధ్య తన సతీమణి జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మగలిర్ మట్టం’ ప్రమోషన్లలో భాగంగా దోసె ఛాలెంజ్ ఒకటి విసిరాడు తమిళ స్టార్ హీరో సూర్య. తన భార్యకు దోసె చేసి ఇస్తూ భర్త ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నది ఈ ఛాలెంజ్. దీనికి కోలీవుడ్ సెలబ్రెటీల్లో చాలామంది భార్యాభర్తలు స్పందించారు. భార్యకు దోసె చేసి ఇస్తూ ఫొటో దిగి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐతే ఆ ఫొటోలన్నింట్లో అందరి దృష్టిని బాగా ఆకర్షించింది అంజలి-జై జంట పంపిన ఫొటోనే.
భార్యాభర్తలకు విసిరిన ఈ ఛాలెంజ్ కు వాళ్లు స్పందించడంతో.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరూ కలిసి కనిపించారు. ఒకే అపార్ట్ మెంట్లో కలిసి ఉంటుండటంతో ఇక పెళ్లే తరువాయి అన్న నిర్ణయానికి వచ్చేశారంతా. కానీ ఇప్పుడు అంజలి సింపుల్ గా జై తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ షాకిచ్చింది.
జైతో కలిసి తాను నటించిన ‘బెలూన్’ ప్రమోషన్లలో భాగంగా అంజలి మాట్లాడుతూ తనపై మీడియాలో.. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మొద్దని అభిమానుల్ని కోరింది. తాను.. జై మంచి స్నేహితులమని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేసింది. పెళ్లికి సంబంధించి తనపై గతంలోనూ చాలా వదంతులు వచ్చాయని.. జైతో తన పెళ్లి గురించి వచ్చిన వార్త కూడా అలాంటిదే అని ఆమె అంది. మరి ఇంతకుముందు జైతో సహజీవనం చేస్తున్నట్లుగా కనిపించి.. పెళ్లి గురించి తనంతట తానే మీడియాకు హింట్లిచ్చి ఇప్పుడేమో జస్ట్ ఫ్రెండ్ అనడం ఏంటి..? మధ్యలో ఇద్దరికీ చెడి.. విడిపోయారా?