Begin typing your search above and press return to search.

ఆమె నా చెల్లి కాదు.. నాకు చెల్లెలే లేదు

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:31 AM GMT
ఆమె నా చెల్లి కాదు.. నాకు చెల్లెలే లేదు
X
అక్క హీరోయిన్ గా క్లిక్కయితే ఆమె చెల్లెలికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆల్రెడీ అక్కకున్న ఇమేజ్ చెల్లెలుకు ప్లస్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో దర్మక - నిర్మాతలు పాపులర్ హీరోయిన్ రక్త సంబంధీకులకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్.. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ఇలా అక్కల ఇమేజ్ తో పాపులారిటీ సొంతం చేసుకున్నవారే.

రీసెంట్ గా హీరోయిన్ అంజలి సిస్టర్ నంటూ ఓ భామ టాలీవుడ్ లో సందడి చేస్తోంది. కాస్త అటూ ఇటూగా ఆమెలో కాస్త అంజలి పోలికలు కనిపిస్తుండటంతో చాలామంది ఆమె అంజలి చెల్లెలనే అనుకుంటున్నారు. ఆరాధ్య అనే పేరున్న ఈ భామ తాను త్వరలో తెలుగులో సినిమా చేస్తున్నానంటూ మీడియాలో అందరికీ చెప్పుకొస్తోంది. అయితే ఆరాధ్య మాటలను అంజలి కొట్టిపారేస్తోంది. అసలు తనకు చెల్లెలే లేదని తెగేసి చెబుతోంది. తనకు ఉన్నది అక్క మాత్రమేనని.. ఆమె హాయిగా కుటుంబ జీవితం గడుపుతోందని.. ఆమె సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ షేర్ చేసింది.

నాకసలు చెల్లెలే లేదని అంజలి అంటుంటే.. ఆరాధ్య మాత్రం తాను ఆమె చెల్లెలినే అన్నట్టుగా ఇప్పటికీ మాట్లాడుతోంది. అంజలికి కుటుంబంతో మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకుని అలా మాట్లాడుతోందా లేక కాస్తంత పోలికలు కలవడాన్ని బట్టి దానిని అవకాశంగా తీసుకోవడానికి ఆరాధ్య అలా మాట్లాడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి అంజలి మాత్రం తన వెర్షన్ గా ఆరాధ్య మాటలు నమ్మవద్దంటూ స్పష్టంగా చెబుతోంది.