Begin typing your search above and press return to search.

సక్కనమ్మ చిక్కినా అందమే.. కాని అంజలి!

By:  Tupaki Desk   |   2 Nov 2018 4:38 AM GMT
సక్కనమ్మ చిక్కినా అందమే.. కాని అంజలి!
X
తెలుగులో చాలా ప్రాముఖమైన సామెత సక్కనమ్మ చిక్కినా అందమే.. దీనర్థం అందంగా ఉండే అమ్మాయి సన్నబడినా కూడా అందంగానే ఉంటుంది. అయితే ఈ సామెత హీరోయిన్‌ అంజలి విషయంలో వర్తించబడదు అనిపిస్తుంది. లావుగా బొద్దుగా ఉండి ముద్దుగా ఉండే తెలుగమ్మాయి అంజలి తాజాగా చాలా బక్కగా మారిపోయింది. ఆమద్య తెలుగు సినిమాల్లో చాలా లావుగా కనిపించడంతో బక్కగా కావాలని అంతా సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు అంజలి బక్కగా మారిపోయింది.

మూడు నెలల కాలంలో దాదాపు 10 కేజీల బరువును తగ్గిన అంజలి చాలా నాజూకుగా తయారు అయ్యింది. అయితే ఈమె అభిమానులు మాత్రం ప్రస్తుత లుక్‌ కంటే అప్పటి లుక్‌ లోనే అంజలి చాలా బాగుండేదని - ఇప్పుడు సన్నగా తయారు అవ్వడం వల్ల మొహంలో కల పోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అంజలి సన్నబడిన పిక్స్‌ సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి.

సోషల్‌ మీడియాలోని ఆ పిక్స్‌ చూసి ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల వారు కూడా షాక్‌ అవుతున్నారు. అంజలి మరీ ఇంతలా సన్నబడుతుందని భావించలేదని - సన్నబడిన అంజలి మొహంలో అందం కనిపించడం లేదు అంటున్నారు. అంజలి మరీ ఇంతగా సన్నబడి ఉండాల్సింది కాదు. కొందరు సన్నగా ఉంటే బాగుంటారు - మరి కొందరు ఒక మోస్తరు లావుగా ఉంటేనే బాగుంటారు. అంజలి విషయంలో మాత్రం రెండవది సరిగ్గా సూట్‌ అవుతుంది. అందుకే అంజలి మళ్లీ లావు అయితే బాగుంటుంది. ఈ నాజూకు సౌందర్యంకు సినిమాల్లో ఆఫర్లు వస్తాయోమో చూడాలి.