Begin typing your search above and press return to search.

అవును 'రిలేషన్ షిప్'లో ఉన్నాను.. కానీ: వకీల్ సాబ్ హీరోయిన్

By:  Tupaki Desk   |   3 April 2021 12:30 PM GMT
అవును రిలేషన్ షిప్లో ఉన్నాను.. కానీ: వకీల్ సాబ్ హీరోయిన్
X
హీరోయిన్ అంజలి గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అంజలి సౌత్ భాషలన్నింటిలో నటించింది. ఇప్పటివరకు ఈ భామ కెరీర్లో 48 సినిమాలు పూర్తి చేసుకుందట. త్వరలోనే 50 మూవీస్ మార్క్ అందుకోనుంది. ఐతే ప్రస్తుతం సినిమాలపరంగా అమ్మడు సరైన ఫామ్ లో లేదనే చెప్పాలి. ఎందుకంటే అంజలి చివరిగా హిట్ కొట్టింది గీతాంజలి సినిమాతోనే. అంటే దాదాపు సోలో హీరోయిన్ గా హిట్టు కొట్టి ఆరు సంవత్సరాల పైనే అవుతుంది. ఇప్పటివరకు కెరీర్లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషించిన అంజలి.. ఇప్పుడు కూడా తనకు ఛాలెంజింగ్ రోల్స్ కావాలని అంటోంది. ఐతే అమ్మడిని స్క్రిప్ట్ ఇంప్రెస్ చేయకపోతే మాత్రం అది ఎలాంటి సినిమా అయినా ఓకే చెప్పను అంటూ ఖరాఖండిగా చెప్పేస్తోంది.

ప్రస్తుతం ఆమె కెరీర్ సాఫిగా లేదు. అందరిలాగే ఆమెకు ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఐతే అంజలి తన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఇప్పుడు చెప్పదలచుకోలేదు అని తాజాగా ఓ మీడియా సమావేశంలో తెలిపింది. కానీ తానిప్పుడు ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం మాత్రం బయటపెట్టింది. అంతకుమించి ఎవరితో రిలేషన్ లో ఉంది అనే విషయాలు మాత్రం సస్పెన్సులో ఉంచింది. ఏం చేస్తాం దురదృష్టం అందుకే ఆ రిలేషన్ షిప్ ఇంకా పరిపూర్ణం కాలేదని చెప్పుకొచ్చింది. సినిమాల కారణంగానే అది సాధ్యం కావడం లేదేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అంజలి దృష్టి మొత్తం తన ఫ్యూచర్ సినిమాలపైనే పెట్టిందట. ఏప్రిల్ 9న అంజలి నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే ఆ సినిమా పై చాలా కాంఫిడెన్స్ ఉందని తన నమ్మకం వెలిబుచ్చింది ఈ తెలుగమ్మాయి. చూడాలి మరి ఇకనైనా సక్సెస్ అందుకొని బిజీ హీరోయిన్ అవుతుందేమో!