Begin typing your search above and press return to search.
అంజలికి మరో ఛాన్స్!
By: Tupaki Desk | 23 Nov 2015 9:30 AM GMTసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆఫర్ కొట్టగానే ఇక అంజలి తెలుగులో సెటిల్ అయిపోయినట్టే అని మాట్లాడుకొన్నారంతా. మహేష్ బాబు - వెంకటేష్ కలిసి నటించిన సినిమాలో ఆఫర్ అంటే అందరూ అదే ఊహిస్తారు. కానీ ఎందుకో తెలియదు... ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో అంజలికి ఆఫర్లు రాలేదు. మసాలా - బలుపు... ఇలా రెండు మూడు చిత్రాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అదే సమయంలో అంజలి కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. దాంతో ఇక అంజలి ఛాప్టర్ తెలుగులో క్లోజయినట్టే అన్న గుసగుసలు వినిపించాయి. కానీ అనూహ్యంగా అంజలి `గీతాంజలి`లాంటి చిన్న సినిమాని ఒప్పుకొని చేసేసింది. అది ఘన విజయం సాధించడంతో మళ్లీ అంజలి హవా మొదలైనట్టైంది.
చిన్న సినిమాలకి దొరికిన పెద్ద హీరోయిన్ గా ఆమెని చూడటం మొదలుపెట్టారు. గీతాంజలి టైప్ లో చిత్రాంగద మొదలుకొని ఇంకో రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతోంది అంజలి. అదే సమయంలో బాలకృష్ణ డిక్టేటర్ లోనూ మెయిన్ హీరోయిన్ గా నటిస్తూ హల్ చల్ చేస్తోంది. చూస్తుంటే అంజలి మేనియా మరికొన్నాళ్లు ఇదే ఊపుతో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా నీలకంఠ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కూడా అంజలి చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన నీలకంఠ క్రియేటివ్ దర్శకుడిగా పేరు పొందాడు. కొంతకాలం క్రితమే ఆయన మాయ అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. అది హిందీలోనూ నిర్మాణమవుతోంది. మహేష్ భట్ ముచ్చటపడి మరీ ఆ సినిమా హక్కుల్ని కొన్నాడు. దానికి కూడా నీలకంఠనే దర్శకుడు. అయితే కారణాలు తెలియవు కానీ... ఆ సినిమా ఆగిపోయినట్టు వార్తలొస్తున్నాయి. అందుకే నీలకంఠ తెలుగులో ఓ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నాడట. అందులో భాగంగానే అంజలిని కథానాయికగా ఎంచుకొని సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక వివరాలు బయటికొచ్చే అవకాశాలున్నాయి.