Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడకి మోడీ కాస్ట్యూమ్స్..

By:  Tupaki Desk   |   5 Sep 2017 5:42 AM GMT
ఉయ్యాలవాడకి మోడీ కాస్ట్యూమ్స్..
X
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై రూపొందుతున్న మూవీ సై రా నరసింహారెడ్డి. కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. తన మరుసటి చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈమూవీకి సంబంధించి.. అన్ని కీలకమైన రోల్స్ ను.. ఆయా రంగాల్లో అత్యధికంగా గుర్తింపు పొందిన వారికే ఇస్తున్నారు. యాక్టింగ్ నుంచి టెక్నీషియన్స్ వరకూ.. ఏ అంశంలోనూ కొద్దిగా కూడా కాంప్రమైజ్ అవడం లేదు దర్శకుడు సురేందర్ రెడ్డి.. నిర్మాత రామ్ చరణ్.

సైరా నరసింహారెడ్డి చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ ను కూడా బాలీవుడ్ నుంచి తీసుకు రావడం విశేషంగా నిలుస్తోంది. మెగా 151కు అంజు మోడీ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేయనున్నారు. ఇప్పటికే ఈమె హైద్రాబాద్ లోనే ఉంటూ.. మూవీ పనులను చూస్తున్నారు. మొదటగా మెగాస్టార్ కాస్ట్యూమ్స్ ను ఫైనల్ చేస్తుండగా.. మిగిలిన యూనిట్ కూడా ఈమెనే డిజైనింగ్ చేయనున్నారు. గతంలో బాజీరావు మస్తానీ.. రామ్ లీలా వంటి చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి.. చారిత్రాత్మక చిత్రాలలో తన స్టైల్ ఎలాంటిదో ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారామె.

మరోవైపు.. మెగాస్టార్ తనయ సుశ్మిత కూడా ఈ కాస్ట్యూమ్ మేకింగ్ టీంలో ఉన్నారట. ఖైదీ నంబర్ 150కి డిజైనర్ గా వర్క్ చేసిన ఆమె.. ఇప్పుడు అంజు మోడీ టీంలో కీలక సభ్యురాలు కావడం విశేషం. మొత్తం 10 మంది టీం అంజు మోడీకి సహాయకులుగా ఉంటున్నారట. దాదాపు 200 ఏళ్లకు పూర్వం చరిత్రను వీలైనంతగా స్టడీ చేసి.. బోలెడంత రీసెర్చ్ చేసి.. ఆ కాలానికి తగినట్లుగా డిజైన్స్ చేస్తుండడం విశేషం.