Begin typing your search above and press return to search.
నిజంగా నాని అలా ఎలా మారిపోయాడబ్బా?
By: Tupaki Desk | 25 Dec 2021 8:33 AM GMTనాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమా తెరకెక్కింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. నాని ద్విపాత్రాభినయం చేయడం .. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ నటించడం .. కథా నేపథ్యం .. ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి.
విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ అంతా కూడా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ నేపథ్యంలో నాని శ్రీమతి అంజూ ఈ సినిమాను గురించి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
చూడటానికి నాని పాత్ర ఈ సినిమాలో కూడా చాలా సింపుల్ గానే ఉంటుంది. అయినా తెరపై 'శ్యామ్ సింగ రాయ్' మాత్రమే కనిపిస్తున్నాడు. ఆ పాత్రలోకి ఆయన అంతలా ఎలా మారిపోయాడనేదే అర్థం కావడం లేదు" లేదు అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అంటే నాని లుక్ చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ, ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.
చాలా కొద్ది పాటి మార్పులతో నానీని కొత్తగా చూపించినప్పటికీ, తన నటనతో ఆ పాత్రను ఆయన మరో స్థాయికి తీసుకుని వెళ్లాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం టీమ్ అంతా కూడా కష్టపడటమే" అనే అర్థంతో నానీ ఫొటోతో పాటు ఆమె ఆ ట్వీట్ చేశారు.
నిజంగానే నాని తన కెరియర్ లో హెవీ లుక్స్ కి చాలా దూరంగా ఉంటూ వచ్చాడు. పాత్ర పరంగానే ప్రేక్షకులకు మరింత చేరువవుతూ వెళ్లాడు. తెరపై తాను కాకుండా తన పాత్ర మాత్రమే కనిపించేలా చేయగలిగాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మద్దతును కూడగట్టుకోవడం ఒక సవాల్ లాంటిది. అప్పుడే వాళ్లు థియేటర్లకు రావడానికి సిద్ధపడతారు. నాని చాలా తక్కువ కాలంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ తన సినిమాలకి వచ్చేలా చేసుకోగలిగాడు. ఆయన ఎంచుకునే పాత్రలు .. కథలు కూడా అందుకు కారణం.
ఇక 'శ్యామ్ సింగ రాయ్' సినిమా కూడా ఆ కోవలోనిదే. నాని - సాయిపల్లవి ట్రాక్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ను రప్పిస్తోంది. ఎందుకంటే సాయిపల్లవికి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సినిమాలో నాని - కృతి శెట్టి ట్రాక్ కోసం యూత్ ఎక్కువగా థియేటర్లకు వస్తారు. ఇలా రెండు కాలాల్లో .. రెండు విభిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో నాని కనిపిస్తాడు. అదే ఈ సినిమాకి ప్రధానమైన అంశంగా మారింది. ఇక ఫొటో గ్రఫీ .. కొరియోగ్రఫీ .. సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.