Begin typing your search above and press return to search.

నన్ను ఎక్స్ అనకండి ప్లీజ్

By:  Tupaki Desk   |   8 July 2017 5:30 PM GMT
నన్ను ఎక్స్ అనకండి ప్లీజ్
X
ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ మూవీలో ఆన్ స్క్రీన్ ధోనీగా అందరినీ అలరించాడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఈ హీరో గతంలో సీరియల్స్ లో కూడా నటించేవాడు. అప్పట్లోనే ఇతనికి అంకితా లోఖండే అనే గాళ్ ఫ్రెండ్ కూడా ఉంది. ధోనీ మూవీ తర్వాత సుశాంత్ కి క్రేజ్ వస్తే.. ఇప్పుడు అంకితకు కూడా గుడ్ టైమ్ ప్రారంభమైపోయింది.

ఈమె ఓ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ సంపాదించేసింది. మణికర్ణిక అనే టైటిల్ పై కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో.. ఝాన్సీ లక్ష్మీ బాయ్ కథను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రకు అంకితా లోఖండేను తీసుకున్నారు. అయితే.. ఈమెను మాత్రం ఇంకా మీడియా జనాలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ గాళ్ ఫ్రెండ్ గానే చూస్తున్నారు. తనకంటూ ఐడెంటిటీ ఉండగా.. దాన్ని వదిలేసి సుశాంత్ మాజీ లవర్ గా చూస్తుండడాన్ని అంకిత అస్సలు సహించలేకపోతోంది.

తాను చేస్తున్న సీరియల్స్.. బాలీవుడ్ మూవీస్ ని పట్టించుకోకుండా.. కేవలం ఓ హీరోకు మాజీ లవర్ గా చెప్పడాన్ని అంకిత ఖండిస్తోంది. ఇకపై మీడియా జనాలు తన దగ్గర ఆ మాట తీసుకురాకూడదని స్ట్రాంగ్ గా చెబుతూనే.. నన్ను ఎక్స్ గాళ్ ఫ్రెండ్ అనకండి ప్లీజ్ అంటోంది అంకితా లోఖండే.