Begin typing your search above and press return to search.

సుశాంత్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ప్రియురాలు

By:  Tupaki Desk   |   29 Aug 2020 1:30 AM GMT
సుశాంత్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ప్రియురాలు
X
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో అనూహ్యమైన మలుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ఓ జాతీయ చానెల్ తో మాట్లాడుతూ సుశాంత్ కు, మాజీ ప్రియురాలు అంకితా లోఖండేకు మాటలు కలిశాయని.. వారిద్దరూ మాట్లాడుకున్నారని ఆరోపించారు.

దీనిపై తాజాగా మాజీ ప్రియురాలు అంకితా లోఖండే స్పందించారు. సుశాంత్ తో విడిపోయిన తర్వాత తానెప్పుడు మళ్లీ అతడితో మాట్లాడలేదని అంకిత స్పష్టం చేశారు. తనకు సుశాంత్ ఫ్లాట్ కొనిచ్చాడన్న ఆరోపణలు అవాస్తవమని.. విడిపోయాక తాము ‘మణికర్ణిక’ సినిమా విడుదల అప్పుడే సోషల్ మీడియాలో పలకరించుకున్నామని.. ఫోన్ లోనూ మాట్లాడలేదని వివరణ ఇచ్చింది.

సుశాంత్ తనతో ప్రేమలో ఉన్నప్పుడు సైక్రియాటిస్ట్ ను కలవలేదని.. ఎలాంటి డిప్రెషన్ కు గురికాలేదని.. రియా తో ప్రేమాయాణంలోనే ఇలా జరిగిందని అంకిత ఆరోపించింది. తాను సుశాంత్ తల్లిదండ్రులకే మద్దతు పలుకుతున్నానని... రియా వల్లే సుశాంత్ ఇలా అయిపోయాడన్న వాళ్ల ఆరోపణలకు మద్దతు తెలుపుతున్నానని అంకిత వివరించింది.