Begin typing your search above and press return to search.
సుశాంత్ : అంకితకు కూడా ఆమె పైనే డౌట్
By: Tupaki Desk | 31 July 2020 12:30 PM GMTదివంగత బాలీవుడ్ స్టార్ యాక్టర్ సుశాంత్ రాజ్ పూత్ ఆత్మహత్యపై నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు. ఆఫర్లు లేక డిప్రెషన్ తో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ట్యాలెంట్ ఉన్న సుశాంత్ ను బాలీవుడ్ మాఫియా తొక్కేసింది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయ్యింది.
సుశాంత్ తో ఏడాది కాలం సహజీవనం చేసినట్లుగా చెబుతున్న రియా చక్రవర్తి అతడు మరణించడానికి కొన్ని రోజుల ముందు అతడి నుండి విడి పోయింది. ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. అతడి ఇంటి నుండి వెళ్లి పోయిన తర్వాత అతడి మరణ వార్త తెలిసి షాక్ అయ్యాను అంటూ పోలీసుల విచారణలో పేర్కొంది. తాజాగా సుశాంత్ మాజీ ప్రియురాలు అయిన అంకిత లోక్వాండే పోలీసుల విచారణలో రియా వల్ల తాను కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నట్లుగా నాతో సుశాంత్ అన్నాడని అంకితా చెప్పుకొచ్చింది.
రియా ప్రేమ పేరుతో సుశాంత్ ను మోసం చేసి ఉంటుందని అందుకే ఆమె వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. సుశాంత్ డిప్రెషన్ కు గురయ్యాడని బైపోలార్ డిజాస్టర్ అంటూ అతడి గురించి మాట్లాడవద్దంటూ విజ్ఞప్తి చేసింది. గతంలో ఆఫర్లు లేక చాలా ఇబ్బంది పడ్డ సందర్బాలు ఉన్నాయి. కాని ప్రస్తుతం సుశాంత్ కు ఎలాంటి డిప్రెషన్ లేదు. ప్రేమ కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అంటూ అనుమానం వ్యక్తం చేసింది.