Begin typing your search above and press return to search.

పవన్ భార్య.. ఇంత లో ప్రొఫైలా?

By:  Tupaki Desk   |   12 Nov 2016 6:44 AM GMT
పవన్ భార్య.. ఇంత లో ప్రొఫైలా?
X
పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా మీడియా ముందుకు వచ్చేందుకు గానీ.. వార్తల్లో నానేందుకు కానీ అంతగా ఉత్సాహం చూపించే వ్యక్తి కాదు. సెలబ్రిటీ స్టేటస్ ఉన్నా సరే.. ఆ స్థాయిని ప్రదర్శించే ప్రయత్నం చేసినట్లుగా కనిపించదు. ఈ విషయం మరోసారి మీడియా జనాలకు అర్ధమైంది.

రీసెంట్ గా మంచు విష్ణు.. అతని భార్య విరానికలు తమ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ లో హాలోవీన్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చాలామంది సినిమా తారలతో పాటు.. బోలెడుమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో పవన్ భార్య అన్నా లెజినోవా కూడా ఉంది. దీంతో.. ఫోటోగ్రాఫర్లు చకచకా కెమేరాలను క్లిక్ మనిపించేశారు. కానీ ఇలాంటి విషయాల్లో ఈమె దగ్గర స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయ్. వెంటనే ఆయా కెమేరామెన్ దగ్గరకు వచ్చి.. తాను ఫోటోలకు ప్రచారానికి దూరంగా ఉంటానని.. ఆయా ఫోటోలను డిలెట్ చేసేయమని సున్నితంగా కోరింది.

అంత పెద్ద సెలబ్రిటి అయినా.. అంత సున్నితంగా రిక్వెస్ట్ చేసే సరికి ప్రతీ ఒక్కరూ ఆ పని చేయక తప్పలేదు. అన్ని ఫోటోలు డిలెట్ అయ్యాయని తెలిశాకే అక్కడి నుంచి కదిలింది అన్నా లెజినోవా. ప్రొఫైల్ లో లెవెల్ లో ఉన్నా.. పట్టు మాత్రం గట్టిదే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/