Begin typing your search above and press return to search.
ఇంత ఇబ్బంది పడుతూ సూపర్ స్టార్ తో పోటీ అవసరమా?
By: Tupaki Desk | 24 Oct 2021 3:54 AM GMTకరోనా కారణంగా మూడ పడ్డ థియేటర్లు ఎట్టకేలకు మళ్లీ పునః ప్రారంభం అయ్యాయి. మొన్నటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీ అంటూ అర కొర థియేటర్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఇటీవలే దేశం మొత్తం కూడా థియేటర్లు మునుపటి స్థితికి రావడం జరిగింది. దాంతో సినిమాల విడుదల జోరు ప్రారంభం అయ్యింది. అన్ని భాషల్లో కూడా దీపావళికి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద షేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే ఈ సమయంలో విడుదల కాబోతున్న పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు రాకపోవడం మంచిది అనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ఏ స్థాయిలో జనాలు వస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. కనుక మొదటి మూడు నాలుగు రోజుల్లోనే సాధ్యం అయినంత వరకు వసూళ్లు దక్కించుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ థియేటర్లలో రావాలని భావిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన అన్నాత్తే సినిమా ను దీపావళి సందర్బంగా తమిళనాట అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ వారు అన్నాత్తేను అత్యథిక థియేటర్లలో విడుదల చేసేందుకు గాను రాష్ట్రంలోని స్క్రీన్స్ లో దాదాపుగా 90 శాతం స్క్రీన్స్ ను బుక్ చేశారని తెలుస్తోంది. వారం రోజుల పాటు తమిళనాడు మొత్తం మరే సినిమా కనిపించకుండా అన్నాత్తేనే కనిపించబోతుంది అంటూ తమిళ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే దీపావళికి విశాల్ హీరోగా నటించిన 'ఎనిమి' సినిమాను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. రజినీకాంత్ తో పోటీ పడే ఉద్దేశ్యం లేదు కాని మరో ఆప్షన్ లేక పోవడం వల్లే ఎనిమి సినిమాను దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా విడుదల కోసం నిర్మాతలకు థియేటర్లు పెద్ద సమస్యగా మారింది.
రజినీకాంత్ సినిమాకే అన్ని థియేటర్లు బుక్ చేశారు. కనీసం 250 థియేటర్లు కూడా ఎనిమికి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో నిర్మాతల మండలి మరియు బయ్యర్లకు ఎనిమి చిత్ర నిర్మాత తమ సినిమాకు కనీసం 250 థియేటర్లు అయినా కేటాయించాలంటూ విజ్ఞప్తి చేస్తున్న వాయిస్ నోట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ సినిమాను విడుదల చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్మాత చేస్తున్న విజ్ఞప్తిపై కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయితే మరి కొందరు మాత్రం ఈ సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి స్టార్ తో పోటీ అవసరమా అంటున్నారు. ఎనిమి సినిమాలో విశాల్ తో పాటు మరో హీరో ఆర్య కీలక పాత్రలో నటించాడు. వీరిద్దరిది హిట్ కాంబో కనుక ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. కాని సినిమా విడుదలకు మాత్రం థియేటర్లు దొరకడం లేదు. ఈ సమయంలో విశాల్ టీమ్ ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.