Begin typing your search above and press return to search.

అన్నాత్తే అప్‌డేట్‌ః ఇక మెల్లగా కానిచ్చేద్దాం

By:  Tupaki Desk   |   31 Dec 2020 5:30 AM GMT
అన్నాత్తే అప్‌డేట్‌ః ఇక మెల్లగా కానిచ్చేద్దాం
X
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయాలు లేనట్లే అంటూ క్లారిటీ వచ్చేసింది. ఆరోగ్యం సహకరించక పోవడంతో పాటు పలు ఇతర కారణాల వల్ల రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఎగ్జిట్‌ అయ్యారు అనే టాక్ వినిపిస్తుంది. రజినీకాంత్ రాజకీయాలు వదిలేసినా సినిమాలు మాత్రం కంటిన్యూ చేస్తాడట. సినిమాల్లో రజినీకాంత్‌ బిజీ అవ్వడం కోసం కాస్త సమయం తీసుకుంటున్నాడు. మొదటగా అనుకున్న ప్రకారం అన్నాత్తే సినిమాను ఏకధాటిగా షూటింగ్‌ జరిపి నెల రోజుల్లోనే పూర్తి చేయాలని రజినీకాంత్‌ భావించాడు. అందుకోసం హైదరాబాద్‌ లో భారీ షెడ్యూల్‌ ను ప్లాన్‌ చేశారు. కాని అనారోగ్య కారణంగా చెన్నై చెరుకున్న రజినీకాంత్‌ ఇప్పట్లో హైదరాబాద్‌ రాలేను అంతా చెన్నైకి వచ్చేయండి అంటూ సమాచారం ఇచ్చాడట.

రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం లేదు కనుక మెల్లగానే షూటింగ్‌ చేద్దాం అంటూ దర్శకుడికి రజినీకాంత్‌ సన్నిహితుల నుండి మెసేజ్‌ వెళ్లిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రజినీకాంత్‌ హీరోగా మరి కొన్ని సినిమాలు కూడా ఈ సమయంలో క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం లేకపోయినా ఎన్నికల సమయంలో ఆయన ఏదైనా పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. కాని అది కూడా ఏమీ లేదని ఏ పార్టీకి ఆయన మద్దతుగా నిలిచే అవకాశం కనిపించడం లేదని సినిమాలతోనే మళ్లీ ఫిబ్రవరి నుండి బిజీ అవ్వాలని భావిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.