Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి కారణం అతడేనా..?
By: Tupaki Desk | 29 Nov 2020 1:30 AM GMTప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ - డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'ఖిలాడీ' చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్ కోనేరు సత్యనారాయణ తో కలిసి పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీని కూడా జయంతిలాల్ నిర్మించనున్నారు. 'ఛత్రపతి' హిందీ రీమేక్ గా రూపొందనున్న ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. అయితే పెన్ స్టూడియోస్ వారు తెలుగు సినీ ప్రముఖుల సినిమాలకు పెట్టుబడులు పెట్టడానికి టాలీవుడ్ లో విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు కారణమని తెలుస్తోంది.
తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడు పాత్రల్లో నటిస్తూ నటుడు అనూప్ సింగ్ ఠాగూర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పెన్ స్టూడియోస్ వారికి అనూప్ సింగ్ ఠాగూర్ కి మంచి రిలేషన్ ఉండటంతో ఇప్పుడు ఆయన రిఫరెన్స్ తెలుగు వారి సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. బెల్లకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి రీమేక్' తో పాటు రవితేజ 'ఖిలాడీ'లో కూడా పెన్ వారు పెట్టుబడులు పెట్టడం అనూప్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలో జరిగిందట. ఈ క్రమంలో తెలుగు తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన 'రాక్షసుడు' చిత్రం హిందీ రీమేక్ నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతున్నారట. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు 'ఛత్రపతి' రీమేక్ లో విలన్ గా అనూప్ సింగ్ నటిస్తున్నాడని బీ టౌన్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.