Begin typing your search above and press return to search.
నాకు కూడా మంచి వైద్యం అందితే బుతుకుతాను! మరో నటుడు మృతి
By: Tupaki Desk | 9 May 2021 4:05 PM GMTభారత్ లో కరోనా కోరలు చాచి విరుచుకుపడుతోంది. మృత్య ఘంటికలు మ్రోగిస్తూ... ఇప్పటికే మూడు లక్షల మందిని బలిగొంది. వైరస్ బారిన పడి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సైతం కన్ను మూసారు. తాజాగా నటుడు రాహుల్ విహ్రో కూడా మహమ్మారి ముందు తల వంచక తప్పలేదు. కరోనాకి సరైన చికిత్స అందకపోవడంతో ఆదివారం మధ్నాహ్నం ఓ ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే చివరి క్షణాల్లో రాహుల్ పెట్టిన పోస్టులు అందర్ని కలిచి వేసాయి.
నాకు కూడా మంచి వైద్యం అందితే బుతుకుతాను! అంటూ ఫేస్ బుక్ వేదికగా తన బాధను చెప్పుకున్నాడు. మళ్లీ పుడితే మంచి పనులు చేస్తా..ఇప్పటికైతే బ్రతుకుతానన్న ఆశ లేదని చెప్పి ఆ కాసేపటికే రాహుల్ ప్రాణాలు విడిచాడు. రాహుల్ చనిపోయిన విషయాన్ని థియేటర్ డైరెక్టర్ ప్లేరైట్ అరవింద్ గౌర్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. ఆ తర్వాత రాహుల్ మృతిని కుటుంబీకులు ఖరారు చేసారు. రాహుల్ డిజిటల్ ఫ్లాట్ ఫాం పై మంచి పేరు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ లో కెరీర్ మొదలు పెట్టి ఓటీటీ స్టార్ గా ఎదిగాడు.
రాహుల్ స్వస్థలం ఉత్తరాఖాండ్. అయితే రాహుల్ కరోనా సోకిన తర్వాత చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ధైర్యాన్ని కోల్పోయాడు. చివరికి నేటితో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.