Begin typing your search above and press return to search.
మరో నటుడు విడాకుల కోసం దరఖాస్తు
By: Tupaki Desk | 3 Feb 2022 4:30 AM GMTసెలబ్రిటీ ప్రపంచంలో పెళ్లిళ్లు సంక్లిష్ట ప్రక్రియగా మారుతున్నాయి. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం సర్వసాధారణంగా మారింది. హాలీవుడ్ బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు టాలీవుడ్ లోనూ విడాకులు కామన్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ చాలా వివాహాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సెలబ్రిటీ జంటలు విడిపోతున్నారు.
నాగ చైతన్య- సమంత జంట తర్వాత ధనుష్-ఐశ్వర్య జంట విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో నటుడు తన భార్య నుంచి విడిపోతున్నాడు. టాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలను కొన్నేళ్ల పాటు ఏలిన సదరు నటుడు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
యాభై పైబడిన వయసు ఉంది అతడికి. తన నలభైల్లో వైవాహిక జీవితంలోకి ప్రవేశించాడు. అతను ఒక వర్ధమాన నటిని సింపుల్ గా వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత విడిపోతున్నారు.
అతడు విలన్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత భారీ చిత్రాలలో నటించాడు. విడిపోవడానికి కారణం తెలియరాలేదు. అయితే అతను విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. విడాకులు త్వరలో లాంఛనంగా జరగనున్నాయి. ఏది ఏమైనా సెలబ్రిటీ జంటల విడాకుల వార్తలు నిత్యకృత్యంగా మారిపోవడం బాధాకరం.