Begin typing your search above and press return to search.
‘మా’ అధ్యక్ష రేసులోకి మరో కృష్ణుడు వచ్చేశాడుగా?
By: Tupaki Desk | 24 Aug 2021 1:30 PM GMTమూవీకి ఏ మాత్రం తీసిపోని మలుపులతో సాగుతోంది మూవీ ఆర్టిస్ట్స్ అసిసోయేషన్ (మా) ఎన్నికల వ్యవహారం. ఈ ఏడాది మొదట్లో జరగాల్సిన ఎన్నికలు.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడటం తెలిసిందే. అనంతరం 'మా' అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తానని ప్రకటించిన నాటి నుంచి రోజుకో మలుపు తిరుగులున్న ఈ వ్యవహారంలోకి తాజాగా మరోనటుడు తాను కూడా అధ్యక్ష స్థానానికి పోటీ పడనున్నట్లు ప్రకటించారు. దీంతో.. 'మా ' ఎన్నికల వ్యవహారం మరోసారి ఆసక్తికర చర్చకు తెర తీసింది.
ఇప్పటికే ప్రకాశ్ రాజ్ కు పోటీగా మంచు విష్ణు.. జీవిత.. హేమతో పాటు జీవీఎల్ నరసింహారావు ఎన్నికల రేసులో ఉంటామని చెప్పటం తెలిసిందే. అందరిని కలుపుకుపోతా.. మాకు పునర్ వైభవం తీసుకొస్తానని చెబుతూ ప్రకాశ్ రాజ్ చెబుతుంటే.. 'మా'కు అసోసియేషన్ భవనం లేదని.. దాని సంగతి చూస్తానని మంచు విష్ణు చెబుతున్నారు. ఏదో మాట వరసకు చెప్పారన్న భావన కలగకుండా.. ఇప్పటికే మూడు చోట్ల స్థలాల్ని చూస్తున్నట్లుగా చెప్పారు.
ఇక.. తెలంగాణవాదాన్ని తెర మీదకు తీసుకొస్తూ..జీవీఎల్ నరసింహారావు ఎన్నికల రేసులో నిలుస్తానని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా.. కాదంబరి కిరణ్ కుమార్ ఎన్నికల బరిలో నిలుస్తానని చెబుతున్నారు. వెయ్యి కంటే తక్కువ మంది సభ్యులు ఉన్న 'మా' ఎన్నికల్లో తనకు 300పైచిలుకు ఓట్లు పడటం ఖాయమని చెబుతున్నారు. తాను గెలుస్తానని.. తనకు అందరి సపోర్టు ఉందని చెబుతున్నారు.
అదెలానో చెప్పేస్తున్నారు. మొత్తం 900పైచిలుకు ఓట్లలో గత ఎన్నికల్లో 450 ఓట్లు పోలయ్యాయని.. అందులో 300 ఓట్లు తనకు ఖాయంగా పడతాయని.. తన గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నారు. తానీ విషయాన్ని ఓవర్ కాన్ఫిడెన్సుతో చెప్పటం లేదని.. ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత మీకే తెలుస్తుంది చూడండంటూ వ్యాఖ్యానించటం గమనార్హం.మేము సైతం అంటూ ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులకు తన చేతనైన సాయం చేస్తూ గుర్తింపు పొందిన ఆయన.. బరిలోకి దిగుతానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.
ఆదివారం 'మా' సర్వసభ్య సమావేశం జరగటం.. గతంలో మా భవనాన్ని కొని.. తక్కువ ధరకే అమ్మేసిన వైనంపై ప్రశ్నల వర్షం కురిపించటం తెలిసిందే. 'మా' ఎన్నికల్ని వీలైనంత త్వరగా నిర్వహించాలన్న భావన అందరూ వ్యక్తం చేస్తున్నా.. సెప్టెంబరు మూడో వారంలో కానీ జరిగే వీల్లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. ఇప్పుడున్న పోటీదారులు సరిపోనట్లు కాదాంబరి బరిలోకి దిగుతున్నానన్న ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ.. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇంత మంది కృష్ణులు తెర మీదకు వస్తానని చెబుతున్న వేళ.. చివరకు ఎంతమంది మిగులుతారో చూడాలి.