Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ ఖాతాలో మరో అవార్డ్..!

By:  Tupaki Desk   |   12 Nov 2022 6:30 AM GMT
పుష్ప రాజ్ ఖాతాలో మరో అవార్డ్..!
X
వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి జిక్యూ మోటీ అవార్డులు అందిస్తుంది. నేషనల్ వైడ్ గా తమ ప్రతిభతో మెప్పించిన వారికి మోటీ అవార్డులు అందిస్తారు. ఇక 2022 మోటీ అవార్డుల్లో లీడింగ్ మ్యాన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా సూపర్ పాపులర్ అయిన అల్లు అర్జున్ తను చేసిన పుష్ప రాజ్ పాత్రకు గాను జిక్యూ మోటీ లీడింగ్ మ్యాన్ 2022 అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ నుంచి జిక్యూ మోటీ అవార్డ్ అందుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.

పుష్ప సినిమా ఏ రోజైతే మొదలు పెట్టాడో ఆ రోజే రికార్డులతో పాటుగా అవార్డులను అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ నీయవ్వ తగ్గేదేలే అన్న తన మేనరిజం పాన్ ఇండియా ఆడియన్స్ కి పూనకాలు వచ్చేలా చేసింది.

ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే పుష్ప రాజ్ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యారు. పుష్ప సినిమాతో తన 20 ఏళ్ల కెరియర్ లో ఎప్పుడూ అందుకోని క్రేజ్.. స్టార్డం ఈ ఒక్క సినిమాతో తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఓ నిర్మాత కొడుకుగా ఒళ్లు దాచుకోకుండా సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాడు అల్లు అర్జున్.

అందుకే అతని రేంజ్ సినిమా సినిమాకు పెరుగుతుంది. పుష్ప పార్ట్ 1 తో పుష్ప రాజ్ కి నేషనల్ లెవల్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు రాగా ఆ సినిమాలో తను చేసిన నటనకు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వచ్చిన కొత్త స్టార్ డం కి జిక్యూ మోటీ 2022 లీడింగ్ మ్యాన్ అవార్డ్ కూడా తన లిస్ట్ లో చేరింది. బాలీవుడ్ స్టార్స్ కి ధీటుగా ఇప్పుడు తెలుగు హీరోలు కూడా అన్నిట్లో పోటీ పడుతున్నారు. జిక్యూ మోటీలో ఎప్పుడూ బాలీవుడ్ స్టార్స్ కే ఛాన్స్ దక్కేది. కానీ ఈసారి పుష్ప రాజ్ కి ఆ అవకాశం దక్కింది.

పుష్ప 1 కే ఇలా ఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నిలుస్తాడని చెప్పొచ్చు. సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన పుష్ప 1 ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయగా ప్రస్తుతం పుష్ప 2 ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అసలు సినిమా సెకండ్ హాఫ్ లోనే ఉందంటూ ఊరిస్తున్న సుక్కు సినిమా పై అంచనాలను మరింత పెంచేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.