Begin typing your search above and press return to search.

'మాస్టర్' కు మరో పెద్ద సమస్య

By:  Tupaki Desk   |   11 Jan 2021 12:15 PM IST
మాస్టర్ కు మరో పెద్ద సమస్య
X
తమిళ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్‌' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సంక్రాంతి కానుకగా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మొదట తమిళనాట 100 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించుకునేందుకు అక్కడ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. కాని కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల నడుమ అలాంటి నిర్ణయం సరైనవి కావు అంటూ హెచ్చరించడంతో ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో తమిళనాడుతో పాటు మొత్తం దేశ వ్యాప్తంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే మాస్టర్‌ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సమయంలో కేరళలో మాస్టర్ విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

కేరళ ఎగ్జిబ్యూటర్ల యూనియన్ గత కొన్ని రోజులుగా ప్రభుత్వంను ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ట్యాక్స్ తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ వస్తుంది. ప్రభుత్వం నుండి రెస్పాన్స్‌ రాకపోవడంతో సినిమాల ప్రదర్శణకు నో చెబుతుంది. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకునే వరకు కొత్త సినిమాలను ఎగ్జిబ్యూట్‌ చేయము అంటూ వారు ఇప్పటికే ప్రకటించారు. దాంతో మాస్టర్ సినిమా కేరళలో విడుదల విషయం అనుమానంగా ఉంది. కేరళలో నెలకొన్న పరిస్థితులు మాస్టర్‌ సినిమాకు పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు.

మలయాళ సూపర్‌ స్టార్స్‌ రేంజ్ లో అక్కడ విజయ్ సినిమా వసూళ్లు రాబడుతుంది. తమిళనాట ఉన్నంత క్రేజ్‌ విజయ్ కి మలయాళంలో కూడా ఉంది. అలాంటి చోట సినిమా విడుదల ఇబ్బందిగా ఉండటంతో భారీ నష్టం తప్పదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. విడుదలకు ఒక రోజు అటు ఇటుగా అయినా సమస్య పరిష్కారం అయ్యేనేమో అంటూ యూనిట్‌ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్‌ భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో కూడా మాస్టర్ బొమ్మ పడబోతుంది.