Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ కు మరో అతి పెద్ద షాక్‌ 'జెర్సీ'

By:  Tupaki Desk   |   25 April 2022 3:30 PM GMT
బాలీవుడ్‌ కు మరో అతి పెద్ద షాక్‌ జెర్సీ
X
కరోనా తర్వాత పుష్ప... ఆర్ ఆర్ ఆర్‌.. కేజీఎఫ్ 2 ఇంకా కొన్ని సౌత్‌ సినిమాలు హిందీలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అల్లాటప్పా విజయాలు కాదు.. ఏకంగా వందల కోట్ల వసూళ్లను ఈ సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద దక్కించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభం అయ్యి నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా కూడా హిందీ బాక్సాఫీస్ వద్ద సౌత్‌ సినిమాల సందడి తప్పితే హిందీ సినిమాల జోరు మాత్రం కనిపించడం లేదు.

ఒకటి రెండు హిందీ సినిమాలు పర్వాలేదు అనే టాక్‌ దక్కించుకున్నా కూడా వసూళ్ల విషయంలో మాత్రం తీవ్ర నిరాశ తప్పడం లేదు. ఆమద్య గంగూ భాయ్ సినిమా వంద కోట్ల వసూళ్లకే గొప్ప విషయం గా హడావుడి చేశారు. ఇక తాజాగా విడుదల అయిన జెర్సీ సినిమా విషయంలో కూడా హిందీ ఫిల్మ్‌ మేకర్స్ కు అతి పెద్ద షాక్‌ కు గురి అయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

షాహిద్‌ కపూర్ హీరోగా తెలుగు లో సూపర్ హిట్‌ అయిన జెర్సీ ని అదే టైటిల్‌ తో హిందీ లో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ హిట్‌ అవుతుందని ప్రతి ఒక్కరు భావించారు. తెలుగు లో కంటే జెర్సీ కి హిందీ లోనే స్కోప్ ఎక్కువ ఉందంటూ అంతా భావించారు. అంతా భావించినట్లుగానే జెర్సీ సినిమాకు చాలా పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి... చాలా మంచి స్పందన వచ్చింది. కాని వసూళ్లు మాత్రం కనిపించడం లేదు.

హిందీ లో ఆర్ ఆర్ ఆర్‌ మరియు కేజీఎఫ్ 2 లు సాధించిన వసూళ్లతో పోల్చితే మరీ దారుణం అంటూ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి వసూళ్లను జెర్సీ నుండి ఊహించలేదు అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ సినిమాలు అంటే ఈమద్య కాలంలో ఉత్తరాది ప్రేక్షకులకు ఆసక్తి కలగడం లేదు. అందుకే కేజీఎఫ్ ఉండగా జెర్సీ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.

కేజీఎఫ్ 2 తో పోటీ పడలేక జెర్సీ సినిమా బొక్క బోర్లా పడింది. సినిమాల విడుదలకు ముందు జెర్సీ విడుదల కాబోతుండగా కేజీఎఫ్ విడుదల సరైన నిర్ణయం కాదని అంతా అనుకున్నారు. కేజీఎఫ్ కు నష్టం తప్పదని భావించారు.

కాని అనూహ్యంగా కేజీఎఫ్ కు ఎలాంటి నష్టం లేకపోగా జెర్సీ సినిమా బొక్క బోర్లా పడింది. ఇలా సౌత్ సినిమాల వల్ల బాలీవుడ్‌ సినిమాలు బలి అవ్వడం చూస్తూ బాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారట.