Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్-శంక‌ర్ తో మ‌రో బిగ్ స్టార్!

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:22 AM GMT
చ‌ర‌ణ్-శంక‌ర్ తో మ‌రో బిగ్ స్టార్!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్-శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ మార్క్ ఎలివేష‌న్స్ తో ఆర్ సీ 15వ చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సినిమా క‌థ‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు అంతే వేగంగా తెర‌పైకి వ‌స్తున్నాయి.

ఐఏఎస్ అధికారి రాజ‌కీయాల‌లోకి వ‌స్తే వ్య‌వ‌స్థ‌లో జ‌రిగే మార్పులు ఎలా ఉంటాయి? పొలిటిక‌ల్ సిస్ట‌మ్ పై చ‌ర‌ణ్-శంక‌ర్ మార్క్ పంచ్ ఎలా ఉంటుంది? అన్న అంశాల్ని సినిమాలు హైలైట్ చేస్తున్న‌ట్లు `ఒకే ఒక్క‌డు` చిత్రాన్ని మించి ఉంటుంద‌న్న అంశం ప్ర‌ధానంగా హైలైట్ అవుతుంది. సినిమాకి సంబంధించిన క‌థాంశం..ఇదా? కాదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు గానీ.. ఈ కాంబినేష‌న్ ప్ర‌క‌ట‌న‌తోనే పెద్ద ఎత్తున సినిమాకి బిజినెస్ జ‌రిగిపోతుంది.

ఇప్ప‌టికే హిందీ రైట్స్ ని భారీ ధ‌ర‌కు ఓ కార్పోరేట్ సంస్థ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అందుకోసం వంద‌ల కోట్లు వెచ్చించిన‌ట్లే మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కించాయి. మిగ‌తా ఏరియాల నుంచి పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆ అంచనాల్ని నిల‌బెట్టుకోవాల్సిన బాధ్య‌త చ‌ర‌ణ్-శంకర్ ద్వ‌యంపై ఉంది. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టు శంక‌ర్ రంగం సిద్దం చేస్తున్నారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. రెండ‌వ షెడ్యూల్ ని రాజ‌మండ్రిలో షూట్ చేసారు. ఎస్ జె సూర్య‌..శ్రీకాంత్ లాంటి వారు ప్ర‌తినాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఇద్ద‌రికి విల‌న్లుగా మంచి పేరు సంపాదించారు.

ప్ర‌తి నాయ‌కులుగా బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వ‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయినా ఏదో వెలితి శంక‌ర్ ని వెంటాడుతుందో ఏమో! తాజాగా సినిమాలో మ‌రో బిగ్ స్టార్ రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. సినిమాలో ఓ కీల‌క పాత్ర‌కు బిగ్ స్టార్ మాత్ర‌మే నాయ్యం చేగ‌ల‌డు? అని అంత‌టి క్రేజ్ ఉన్న హీరో కోసం వెదుకుతున్న‌ట్లు స‌మాచారం. ఆ పాత్ర ఆన్ స్ర్కీన్న‌పై దాదాపు అర‌గంట పాటు ఉంటుందిట‌. ఇప్ప‌టికే ఇద్ద‌రు స్టార్ హీరోల్ని సైతం అప్రోచ్ అయ్యారుట‌. కానీ ఎవ‌ర్ని ఇంకా ఖ‌రారు చేయ‌లేదుట‌.

ఆ ఇద్ద‌రిపై టెస్ట్ షూట్ నిర్వ‌హించి పాత్ర‌కు ఎవ‌రైతే బెస్ట్ గా సూట్ అవుతారో? వారిని ఎంపిక చేసే ఆలోచ‌న‌లో శంక‌ర్ ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇద్ద‌రి స్టార్ల‌పై టెస్ట్ షూట్ చేసి ఎంపిక చేసేంత సీన్ ఉందంటే? సినిమాలో ఆ పాత్ర చాలా ముఖ్య‌మైన‌దిగానే చెప్పొచ్చు. మ‌రి ఆ హీరో పోషించే రోల్ నెగిటివ్ గా ఉంటుందా? లేక పాజిటివ్ యాంగిల్ లో ఉంటుందా? అన్న‌ది వేచి చూడాలి. అలాగే శంక‌ర్ చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో హీరో కోసం వెతుకులాట మొద‌లు పెట్టారంటే? స్ర్కిప్ట్ లో ఏమైనా మార్పులు చేసారా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తుంది.

అదీ రెండు షెడ్యూల్స్ పూర్త‌యిన త‌ర్వాత ప్ర‌చారంలోకి రావ‌డంతో ఆస‌క్తి సంత‌రించుకుంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇందులో చ‌ర‌ణ్ కి జోడీగా బాలీవుడ్ న‌టి కియారా అద్వాణి న‌టిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.