Begin typing your search above and press return to search.
'పుష్ప'కు మరో బ్రేక్..!?
By: Tupaki Desk | 1 May 2021 11:46 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరోవైపు లెక్కల మాస్టర్ కూడా తన మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి పుష్ప సినిమా షూటింగ్ ఇటీవలే మేకర్స్ ఆపేసారు. ఎందుకంటే కరోనా ప్రభావం వలన సినిమాలన్ని షూటింగ్స్ నిలిపేసి ప్యాకప్ చెప్పేసారు. అయితే ఇప్పటికే పుష్ప సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయిందట. కరోనా ఉన్నప్పటికి సుకుమార్ బృందం మొన్నటివరకు షూటింగ్ ఆపకుండా జరిపారు.
హీరోకు కరోనా వస్తే మిగతా కాస్ట్ తో సీన్స్ తెరకెక్కించిన సుక్కు.. మొత్తానికి ఓ చిన్న షెడ్యూల్ పూర్తి చేసాడట. అయితే తాజా సమాచారం ప్రకారం.. చిత్రంలో విలన్ క్యారెక్టర్ పోషిస్తున్న మలయాళ స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ కరోనా బారినపడటంతో సినిమాకు భారీ బ్రేక్ పడినట్లు అయింది. ఎందుకంటే కరోనా విషయం తెలియగానే ఫాహద్ కేరళకు వెళ్లిపోయాడని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి ఈ లెక్కన ఎంత గుట్టుగా రిస్క్ తీసుకొని షూటింగ్ చేయాలన్నా ఇలా యాక్టర్స్ కూడా కరోనాకు గురవుతుండటంతో సుక్కు బృందం బ్రేక్ తీసుకోక తప్పదు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాని మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి సినిమా రిలీజ్ డేట్ అయితే ఆగష్టు 13న అని ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే వాయిదా పడేలా ఉందని టాక్.