Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు.. అరెస్ట్‌ తప్పదేమో

By:  Tupaki Desk   |   20 Feb 2020 6:45 AM GMT
శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు.. అరెస్ట్‌ తప్పదేమో
X
టాలీవుడ్‌ స్టార్స్‌ ను నోటికి వచ్చినట్లుగా బూతులతో తిట్టేసి సెలబ్రేటీ హోదాను దక్కించుకున్న శ్రీరెడ్డి చిక్కుల్లో పడుతోంది. ఆమె పదే పదే ఎవరిపై పడితే వారిపై బూతుల వర్షం కురిపిస్తుండటంతో ఆమెపై పోలీసు కేసు నమోదు అయ్యింది. ఇటీవలే తనను శ్రీరెడ్డి ఇష్టం వచ్చినట్లుగా సోషల్‌ మీడియాలో తిట్టింది అంటూ కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆ కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.

గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి ఇంకా రాకేష్‌ మాస్టర్‌ ల మద్య సోషల్‌ మీడియాలో మాటల యుద్దం కొనసాగుతుంది. రాకేష్‌ మాస్టర్‌ పై శ్రీరెడ్డి ఇటీవల తీవ్ర స్థాయిలో బూతులు వాడుతూ కామెంట్స్‌ చేసింది. ఆ వీడియోతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు రాకేష్‌ మాస్టర్‌ ఫిర్యాదు ఇచ్చాడు. శ్రీరెడ్డి తనను ఇష్టానుసారంగా తిట్టేసిందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాకేష్‌ మాస్టర్‌ ఫిర్యాదును కరాటే కళ్యాణి ఫిర్యాదుతో జత చేసి రెండు కేసులను ఉమ్మడిగా విచారిస్తున్నట్లుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్పుకొచ్చారు.

ఈమద్య కాలంలో సైబర్‌ క్రైమ్‌ నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో స్పీడ్‌ గా చర్యలు తీసుకుంటున్నారు. కనుక త్వరలోనే శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టిన శ్రీరెడ్డిని పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేస్తారా లేదంటే హైదరాబాద్‌ వచ్చే వరకు వెయిట్‌ చేస్తారా అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది.