Begin typing your search above and press return to search.
హీరోగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్..?
By: Tupaki Desk | 26 Nov 2022 3:37 PM GMTసినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా సక్సెస్ అయిన చాలామంది.. మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్లుగా మారడం ఎప్పటినుంచో మనం చూస్తున్నాం. అందులో కొందరు హీరోలుగా మారి ప్రేక్షకులను అలరించినవారు కూడా ఉన్నారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.. ఇప్పుడు దర్శకుడిగా హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రాఘవ లారెన్స్ కూడా హీరోగా మారాడు. ఇప్పుడు ఓవైపు డైరెక్షన్ చేస్తూనే మరోవైపు కథానాయకుడుగా సినిమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో అమ్మ రాజశేఖర్ కూడా దర్శకుడిగా నటుడిగా కొన్ని సినిమాలు చేసాడు. జానీ మాస్టర్ కూడా త్వరలోనే హీరోగా బిగ్ స్క్రీన్ మీదకు రాబోతున్నాడు. అయితే ఈ మధ్యలో మరో కొరియోగ్రాఫర్ కూడా హీరో అవుతున్నాడు.
ఇటీవల కాలంలో చిన్న మీడియం రేంజ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్న యష్ మాస్టర్.. కొత్త కొత్త స్టెప్పులను కంపోజ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే యాష్ ఇప్పుడు హీరోగా కెమెరా ముందుకు రావడానికి రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అది కూడా దిల్ రాజు వంటి అగ్ర నిర్మాత చేతుల మీదుగా యంగ్ డ్యాన్స్ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది.
దిల్ రాజు ఇప్పటికే అనేక మంది నటీనటులు - సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీలో లాంచ్ చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు యష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో శశి అనే నూతన దర్శకుడిని కూడా పరిచయం చేయబోతున్నారు. దిల్ రాజు రిలీజ్ చేసిన 'లవ్ టుడే' చిత్రంలో తెలుగు డైలాగ్స్ శశి రాసినట్లు తెలుస్తోంది.
యష్ హీరోగా నటిస్తున్న సినిమా డ్యాన్స్ మరియు సంగీత ప్రధానంగా సాగే రాక్ స్టార్ కథాంశంతో తెరకెక్కుతోందని అంటున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెళ్ళడించనున్నారు.
దిల్ రాజు ఒకే సినిమాతో హీరోని మరియు డైరెక్టర్ ని పరిచయం చేస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అందులోనూ ఇటీవల కాలంలో నిర్మాత చిన్న చిత్రాలను రిలీజ్ చేస్తున్నాడు కానీ.. ప్రొడ్యూసర్ గా అన్నీ పెద్ద ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ యష్ తో లో బడ్జెట్ లో సినిమా చేస్తున్నాడు.
ప్రభుదేవా - రాఘవ లారెన్స్ బాటలో హీరో అవతారం ఎత్తబోతున్న కొరియోగ్రాఫర్ యష్.. నటుడిగా ఇండస్ట్రీలో ఏ మేరకు పేరు తెచ్చుకుంటాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.